అమెరికాలో నెగ్గిన భారతీయ ఆణిముత్యం కమలా హ్యారీస్

 మహిళగా అగ్రరాజ్యంలో ఉన్నత హోదా కెదిగి చరిత్రను తిరగ రాసిన కమలా హ్యారీస్

కమలా హ్యారీస్ పూర్వీకుల గ్రామంలో పండగ వాతావరణం

ఇంటింటా ముగ్గులు - ఆలయాల్లో పూజలు
వనక్కం అమెరికా అంటూ తులసేంద్రపురం గ్రామస్తుల సంబరాలు

అమెరికాకు కాబోయే తదుపరి అధ్యక్షురాలు


అమెరికా ఎన్నికల ఫలితాలు భారతీయలను గతంలో ఎన్నడూ లేనంతగా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి.  సాధారణంగా ఇద్దరు వ్యక్తులు పోటి పడితే ఎవరు గెలస్తారనే విషయం ఆ వ్యక్తులెవరో తెలియని వారిలో కూడ ఆసక్తి నెల కొల్పుతుంది.  కాని ఈసారి జరిగిన ఎన్నికల్లో  భారతీయులు ఎంతో ఉత్కంఠతో  ఓ వ్యక్తి  భవిష్యత్  ఏమిటని ఎదురు చూశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు భారతీయ మూలాలు కలిగిన 55 సంవత్సరాల  కమలా హ్యారిస్. ఆమె సాధించిన విజయం మామాలు  విజయం కాదు.  భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ ప్రపంచాన్ని శాసిస్తున్న దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడం ఆశ మాషి వ్యవహారం కాదు. కమలా హ్యారీస్ కు ఆ అవకాశం దక్కింది.  ఆమె విజయంప్రపంచంలో పలు రికార్డులు నెల కొల్పింది. జో బైడెన్ మాటల్లోనే చెప్పాలంటే కమలా హ్యారీస్ అమెరికాకు కాబోయే తదుపరి అధ్యక్షురాలు.

కమలా హ్యీరీస్ పూర్వీకులు తమిళ నాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురం గ్రామానికి చెందిన వారు.తల్లి  శ్యామలా  గోపాలన్  తన 16 వ ఏట అమెరికాకు ఉన్నత చదువులు కోసం ఔంటరిగా వెళ్లి అక్కడే  వైద్యవిద్యను పూర్తి చేసి జమైకాకు చెందిన  ఎకన మిస్ట్  డొనాల్డ్ హ్యారిస్‌ను పెళ్లి చేసుకుని అక్కడే స్థిర పడి పోయారు.  ప్రమిఖ అంకాలజిస్టుగా  బ్రెస్ట్ కాన్సర్ స్పెషలిస్టుగా శ్యామలా గోపాలన్ సేవ లందించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కమలా హ్యీరిస్  కు ఓ అక్కక కూడ ఉందు. మాయ హ్యారిస్ వయస్సులో రెండేళ్ళు   పెద్ద. కెనడాలో న్యాయ వాద వృత్తిలో స్థిర పడింది.తులసేంద్రపురం

 అమెరికా లో  జరిగిన ఎన్నికలు కమలా హ్యారీస్  పూర్వీకుల స్వగ్రామం తులసేంద్రపురంలో హోరెత్తించాయి. మన దేశంలో జరుగుతున్న ఎన్నికలు కోక పోయినా  కమలా  హ్యారీస్ కోసం గారామంలో వాడ వాడలా బానర్లు వేలాడదీసారు. ప్రతి ఆలయంలో పూజలు చేశారు. ఇక ఆమె గెలిచిందన్న వార్తలతో  గ్రామంలో ఓ పండగ వాతావరణం నెలకొంది. గ్రామం అంతా ముగ్గులో వనక్కం అమెరికా అంటూ  కమలా హ్యారీస్ ఫ్రౌడ్ ఆఫ్ తులసేంద్ర పురం అంటూ శుభాకాంక్షలు తెలియ చేస్తు  ప్రతి ఇంటా వాడ వాడలా ముగ్గులు వేశారు. ఆలయాల్లో కమలా హ్యారీస్ పేరిట ప్రత్యేకంగా పూజలు జరిపించారు. కమలా హ్యారీస్ తమ గ్రామానికి  అంతర్జాతీయ గుర్తింప తెచ్చారని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

కమలా హ్యారీస్ హోవార్డ్ యూనివర్శిటీలో  చదువుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో సిటి అటార్నీగా పనిచేసారు. తరువాత కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గానూ పనిచేసి చిన్నపిల్లలు, శ్వేత జాతీయుల హక్కుల పరిరక్షణ కోసం జో బైడెన్ కుమారుడితో కల్సి పనిచేసారు.  2016 లో కాలిఫోర్నియా నుండి మొదటి ప్రయత్నంలోనే  సేనేటర్ గా ఎంపికయ్యారు.  డెమోక్రాటిక్ పార్టీలో కమలా హ్యారీస్ ఏకంగా అధ్యక్క్ష పీఠం కోసం పోటి పడ్డారు. ఆ తర్వాత జరిగిన మార్పుల్లో  ఉప సంహరించుకున్నారు. ఎ్ననికల ఫలితాలు వెల్లడవుతున్న క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షులు జో బైడెన్ తో కల్సి 

ఆయన స్వరాష్ట్రం డెలవేర్‌ లోని విల్మింగ్టన్‌లో కమలా హ్యారిస్  తొలి ప్రసంగం చేసారు.  ప్రతిభ కలిగిన వారికి దేశాలతో పనిలేదని అమెరికన్లు నిరూపించారని కమలా ఙ్యారీస్ అన్నారు. తన తల్లి శ్యామలా గోపాలన్ ను తలుచుకుని ఆమె మాటలు ఉటంకిస్తూ భావోద్వేగంతో ప్రసంగించారు.  అమెరికా వంటి దేశంలో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్య పడుతుందని తన తల్లి  ఎల్లప్పుడు గట్టిగా నమ్మే వారని ఈ రోజు తన  విషయంలో  అమెరికన్లు తన తల్లి నమ్మకాన్ని నిజం చేసారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. ఈ పదవికి ఎంపికైన మహళల్లోతాను మొదటి మహిళ కావచ్చు కాని చివరి మహిళను మాత్రం కాదంటూ సందేశాత్మక ప్రసంగం చేసారు. తన విజయానికి తోడ్పడిన ఆఫ్రికన్, ఇండియన్, లాటిన్ అమెరికాతో పాటు శ్వేత జాతీ మహుెలలకు ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు