కేంద్రాన్ని బద్నాం చేయాలనే వరద నివేదికలు పంపలేదు- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 


కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలన్న  ఉద్దేశంతోనే  రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టం పై కేందారానికి నివేదికలుపంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  అయినా వరదలవిపత్తులో ప్రజలను ఆదుకావాలని కేంద్రం 220 కోట్లతక్షణ సహాయం అంద చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ పై ప్రధాన మంత్రి మోది వివక్షత ప్రదర్శించాడని మున్సిపల్ శాఖ మంత్రి  కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.  ఎన్నికలపై ఉన్న ప్రేమ వారికి వరద సహాయం పనులపై లేదని అన్నారు. నగరంలో వరద సహాయం కింద ఇచ్చే 10  వేల రూపాయలను కెటిఆర్ ఆనుచరులు తన్నుకు  పోయారని హైదరాబాద్ కు సముద్రాన్ని తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్ దక్కించుకున్నడని విమర్శించారు.

కంటోన్మెంట్ బోర్డ్ వైస్ ఛైర్మన్ రామకృష్ణ, బానుక మల్లికార్జున్ వారి అనుచరులతో ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  తాడ్‌బండ్ సిక్‌ విలేజ్ హాకీ గ్రౌండ్స్‌లో  బెజిపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరద సహాయంపై సిఎం కెసిఆర్, ఆయన తనయుడు కెటిఆర్ చేసిన విమర్శలు తిప్పి కొట్టారు.  పేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్స్ ఇచ్చాడో కెటిఆర్ చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు. హైద్రాబాద్‌లో గుంతలు లేని రోడ్లు కేటీఆర్ చూపించగలడా?. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే వందల కాలనీలు నీట మునిగాయని, ప్రజలకు అబద్దాలు, అవాస్తవాలు చెప్పటం కేటీఆర్‌కు అలవాటుగా మారింది దుయ్య బట్టారు. 

ఇద్దరు రావుల మద్య  సిఎం పీఠం కోసం పోరు- బండి సంజయ్

కెసిఆర్  ఇంట్లో ముఖ్యమంత్రి పీఠం కోసం  కెటిఆర్, సంతోష్ రావుల మద్యవార్ నడుస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.  రాష్ట్ర మంత్రులకు అహంకారం నెత్తినెక్కిందని  అన్నారు. కెసిఆర్ కాబినెట్ లో తిరుగు బోతులు తాగు బోతులు ఉన్నారని విమర్శించారు.  కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర  ప్రభుత్వం పక్క దారి పట్టిస్తోందని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సిఎం కెసిర్ తో చర్చకు సిద్దమని అన్నారు. హిందు దేవుళ్ళను తిట్టిన ఎంఐఎం తో కెసిఆర్ పొత్తు పెట్టుకున్నాడని  2023 లో తెలంగాణలో భారతీయ జనతా పార్టి అధికారంలోకి రాబోతున్నదని బండి సందజయ్ అన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు