ప్లాజ్మా డోనార్స్ గా మారేందుకు కరోనా అంటించుకుంటున్న విద్యార్థులు

 అమెరికాలోనూ విద్యార్థులకు తప్పని ఆర్థిక కట కట

డాలర్ల కోసం కరోన అంటించుకుంటున్న విద్యార్థులు

 భ్రిఘమ్ యంగ్ యూనివర్శిటీలో పసిగట్టి విచారణకు ఆదేశించిన అధికారులు



డాలర్ల కోసం ఆశపడి ఆ యూనివర్శిటి విద్యార్థులు ప్రాణాలకు తెగిస్తున్నారు.  ఏకంగా కరోనా అంటించుకుని పేషెంట్లుగా మంచమెక్కుతున్నారు. కోలుకున్న తర్వాత ప్లాజ్మా డోనార్స్ గా మారి విక్రయిస్తున్నారు.యంగ్ ఎనర్జిటిక్ గా ఉన్న వారికి కరోనా సోకినా ప్రాబ్లమ్ ఉండదని విద్యార్థులు మొండి నమ్మకంతో డాలర్ల కోసం ఈ పనికి పాల్పడుతున్నట్లు యూనివర్శిటి అదికారులు పసిగట్టి షాక్ అయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతున్న  వారు  కేవలం డాలర్ల కోసం ఇట్లా చేస్తున్నారని అధికారులు గుర్తించి విచారణకు ఆదేశించారు. ఎవరైనా డాలర్లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుుతుంటే తమను సంప్రదిస్తే సహాయం చేస్తామని కాని కరోనా అంటించుకోరాదని హెచ్చరించారు.  యూనివర్శిటీలో కరోనా సోకిన  119 మంది విద్యార్థులు 20 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు.

 కావాలని కరోనా అంటించుకున్న వారిని కొంత కాలం సస్పెండ్ చేస్తామని లేదంటే పూర్తిగా డిస్మిస్ చేస్తామని యూనివర్శిటి అధికారులు హెచ్చరికలు జారి చేసారు. కాంపస్ లో ఉండే వారంతా హుందాగా వ్యవహరించాలని కరోనా మహమ్మారి అంటించుకుని దాని వ్యాప్తికి కారణం అయి ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దని యీనివర్శిటి అధికారులు సూచించారు.

అమెరికాలో ప్లాస్మా డోనార్సుకు బాగా డిమాండ్ ఉంది.

ప్రాంతాలను బట్టి  ప్లాజ్మా డోనార్స్ కు డాలర్లు ఫిక్స్ చేస్తున్నారు. ఒక ప్లాజ్మా డోనార్ వారానికి రెండు సార్లు ప్లాజ్మా ఇవ్వవచ్చు.  అట్లా ఇచ్చిన వారికి 100 నుండి  200 డాలర్ల వరకు చెల్లిస్తున్నారని యుఎస్ మీడియాలోవార్తలు వచ్చాయి. 

క్రానిక్ కరోనా పేషెంట్లకు ప్లాజ్మా ట్రీట్ మెంట్ అనేది ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుందనే నమ్మకం లేదనేది సైంటిస్టులు ఓ వైపు చెబుతూనే ఉన్నారు. అట్లా ప్లాజ్మా ఎక్కించిన వారు కూడ మరణించిన సందర్బాలు ఉన్నాయని చెబుతున్నారు. పూర్తిగా నిర్దారణ కాకుండా ప్లాజ్మా  ట్రీట్ మెంట్ చేయడం సరికాదని కూడ సైంటిస్టులు చెబుతున్నా ప్రాణాపాయ స్థితిలో పేషంట్లు ఖర్చు కోసం వెనుకాడకుండా ప్లాజ్మా ట్రీట్ మెంట్ కావాలని కోరుతున్నారట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు