ఆస్తుల నమోదు కోసం వచ్చే ఎన్యుమారేటర్లకు పూర్తిగా సహకరించాలి : వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 


నగరం లో  వ్యవసాయేతర  ఆస్తుల నమోదు కోసం ఇంటింటికీ వస్తున్న ఎన్యుమారేటర్ లకు ఇంటి  యజమానులు పూర్తిగా సహకరించాలని లేని పక్షం లో భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

నగరం లోని వడ్డేపల్లి  టీచర్స్ కాలనీ లో  ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్  శని వారం  పరిశీలించారు

రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయేతర ఆస్తుల  నమోదు కు ఆదేశించిన నేపథ్యం లోనే  నగర పాలక సంస్థ  విరాల నమోదు కార్యక్రమం  చేపట్టిందని ఈ విషయాన్ని గమనించి ఎన్యుమ రేటర్లకు   తప్పని సరిగా వివరాల అంద చేయాలని  భవిష్యత్తులో  వారసులకు సంభంచిందిన ఎలాంటి వివాదాలకు తావు ఉండదని అన్నారు. 

నగరం లో 2 లక్షల 12 వేల గృహాలు నమోదు  ప్రక్రియ  అక్టోబర్ 15 లోగా పూర్తి  చేయాల్సి ఉందని  కలెక్టర్ తెలిపారు. 

 ఆస్తుల విషయం లో భవిష్యత్ లో  ఎలాంటి తగాదాలు   తలెత్త కూడదనే ఉద్దేశంతోనే శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని  ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే నమ్మవద్దని అన్నారు.

 వ్యవసాయేతర ఆస్తులు నమోదు చేస్తే కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ఆడియో, విజువల్, ప్రింట్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని  కార్పొరేషన్ అధికారుల ను అదేశించారు   ఎన్యుమరేటర్ లు  ఇంటికి వస్తే ఇంట్లో ఎవ్వరూ లేరని తిప్పి పంపవద్దని అట్లా చేయడం వల్ల యజమానులే నష్ట పోవాల్సి ఉంటుందని అన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు