ధరణి యాప్ లో ఆస్తులు నమోదు చేయించుకున్న సిఎం కెసిఆర్


 ధరణి యాప్‌లో సీఎం కేసీఆర్‌ శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో వివరాలు నమోదు చేయించుకున్నారు.  మర్కూక్ మండలం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పంచాయితీ రాజ్ సిబ్బందికి   సీఎం కేసీఆర్ తన నివాస గృహ వివరాలను స్వయంగా అందించారు. ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్ సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన నివాస గృహానికి చెందిన వివరాలను ఫొటోతో సహా ప్రత్యేకించిన అప్లికేషన్ TSNPB లో నమోదు చేశారు.

దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు పూర్తిగా సహకరించాలని సిఎం కెసిఆర్ కోరారు. 

ఆస్తులపై ప్రజల హక్కులు, వాటికి పూర్తి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబానికి చెందిన స్థిరాస్తుల వివరాలను నమోదుచేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలతో సహా వ్యవసాయేతర ఆస్తుల నమోదు దేశంలోనే ఇది మొదటి సారని ఇలా చేయడం చాల పెద్ద  ప్రయత్నమన్నారు. వ్యవసాయ భూముల తరహాలోనే ఇక వ్యవసాయేతర ఆస్తులకు సంభదించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు జారి అవుతాయని సిఎం వివరించారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు