బాబ్రి మసీదు కూల్చి వేత కేసులో నిందితులెవరూ లేరు... అభియోగం మోప బడిన వారందరూ నిర్దోషులే

 సరికొత్త చర్చకు దారితీసిన బాబ్రి మసీదు కేసు తీర్పు


బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో  తుది తీర్పు  వెలువరించిన లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు అభియోగం మోపబడి విచారణ ఎదుర్కున్న వారందరికి  క్లీన్‌చిట్ ఇచ్చింది. మసీద్ పై దాడి పథకం మేరకు జరిగిన దాడి కాదని  కుట్ర పూరితంగా దాడి జరిగిందనడానికి ఆధారాలు ఏవి  లేవని కోర్టు స్పష్టం చేసింది. 

2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

చారిత్రాత్మకంగా చెబుతున్న ఈ తీర్పుపై అనేక బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాధారాలు లేవంటూ అభియోగాలు ఎదుర్కున్న వారిలో దోషులెవరూ లేరంటూ ఇచ్చిన తీర్పు పై న్యాయకోవిదులు విస్తుబోతున్నారు.  

1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును  కరసేవకులు కూల్చివేశారు. మొత్తం 48 మందిపై అభియోగాలు నమోదు కాగా.. దర్యాప్తు సమయంలో 17మంది మృతి చెందారు. 2009లో నివేదిక లిబర్హన్‌ కమిషన్ సమర్పించారు. మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉన్నట్లు కమిషన్ తేల్చింది. వెయ్యి మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 28 ఏళ్ల విచారణానంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.

అందరూ నిర్ధోషులైతే కూల్చిందెవరు : అసదుద్దీన్ ఓవైసీ

బారతీయ న్యాయ వ్యవస్థలో ఇది చీకటి రోజు...బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పు బాధ కలిగించింది. సరైన న్యాయం జరగలేదన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. అంతా నిర్దోషులైతే మసీదును ఎవరు కూల్చారు?  బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఉమా భారతి చేసిన వ్యాఖ్యలు నిజం కాదా అని వ్యాఖ్యానించారు. గతంలో ఇదే అంశంపై  సుప్రీం కోర్టు  చట్ట నియమాలను అతిగా ఉల్లంఘించారని బహిరంగ స్థలంలోని ప్రార్థనా స్థలాన్ని నాశనం చేసిన చర్య గా వర్ణించింది. కానీ సీబీఐ కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా ప్రకటించిందని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

న్యాయం బూస్థాపితం చేసారు..నటుడు ప్రకాశ్ రాజ్

నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లోట్వీట్ చేశారు. ఈ తీర్పుతో న్యాయం భూస్థాపితం అయ్యిందని.. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులయ్యారని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు