మీడియా ధిగ్గజం రామోజి రావు ... బాలు విషయంలో అట్లా సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యిండు

తన అక్షరాలతో శాసించిన  ప్రధాన మీడియాల సంస్థల ధిగ్గజం బాలు విషయంలో సోషల్ మీడియాకు ఇప్పుడు టార్గెట్ అయ్యాడు
సోషల్ మీడియా ట్రోలింగ్ పై స్పందిస్తాడా....
సోషల్ మీడియాలో ఎవరేం అంటే నాకేంటని దులుపు కుంటాడా..చూడాలి  


కరోనా సోకి 51 రోజుల పాటు జీవన్మరణ పోరాటం చేసిన ఎస్పి బాలసుబ్రమణ్యం విషయంలో మీడియా ధిగ్గజం చెరుకూరి రామోజీ రావు ఓ అపవాదు ఎదుర్కోక తప్పలేదు. బాలు మరణానంతరం సోషల్ మీడియాలో రక రకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలు మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రామోజి రావే కారణమని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. కొన్ని ఆన లైన్ మీడియా వెబ్ పోర్టర్లలో కూడ ఇలాంటి వార్తలు అనేకం వచ్చాయి.

కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి 70 ఏళ్ళు పై బడిన బాల సుబ్రమణ్యం వైద్యుల సలహాతో మద్రాసులో  ఇంటిపట్టునే ఉన్నారు. కాని లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఈటీవీలో సామజ వరగమన  అనే ప్రోగ్రాం చిత్రీకరించేందుకు బాలును హైదరాబాద్ రావల్సిందిగా ఈటివి నుండి పిలుపు రాగా అయన సంశయించారని చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఇతర టీవీల కన్నా ఈటివి రేటింగ్ పెరిగిన దృష్యా ప్రోగ్రాం చిత్రీకరణ ఎట్టి పరిస్థితుల్లో నిలిపి వేయకుండా కొనసాగించాలని రామోజి రావు నుండి ఆర్దర్ ఉండడంతో  ప్రోగ్రాం బాద్యులు బాలును ఎట్లాగైనా హైదరాబాద్ రావల్సిందిగా బతిమి లాడారని దాంతో భార్య కుమారున్నివెంట బెట్టుకుని బాలు హైదరా బాద్ కు వచ్చాడని చర్చ జరిగింది. ప్రోగ్రాం చిత్రీకరణ లో ప్రముఖ సింగర్ సునీత తో పాటు రవళి కూడ పాల్గొన్నారు.  చిత్రీకరణ సమయంలో పని చేసిన ఆర్కెస్ ట్రా బృందంలో చాలా మందికి కరోనా పాజిటివ్ ఉందని చెబుతున్నారు.  గాయని సునీత కూడ ఈ ప్రో గ్రాం తర్వాత కరోనా భారిన పడి చికిత్స తీసుకోగా బాలు చెన్నై వెళ్ళిన తర్వాత ఆగస్ట్ 5 వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.

కరోనా మహమ్మారికి ముందు ఈటివి రేటింగ్ విషయంలో బాగా వెనుక పడి పోగా కరోనా మొదలైన తర్వాత ఇతర ఎంటర్ టైన్ మెంట్ టీవీల కన్నా ఈటివి రేటింగ్ ఎంతో మెరుగు అవడంతో ఎట్టి పరిస్థితులలో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాం షూటింగులు ఆప కూడదని రామోజి రావు  తీసుకున్న నిర్ణయంతోనే బాలు చెన్నై నుండి తప్పని పరిస్థితులలో హైదరాబాద్ కు వచ్చి షూటింగ్ లో పాల్గొనడం జరిగిందని ఈ షూటింగ్ కనక జరగకుండా ఉంటే బాలు కరోనా భారిన పడే వాడుకాదని ఇంకా ఆయనకు ఏ ప్రాణ హాని ఉండేది కాదని ఇందుకు మొత్తంగా రామోజి రావే కారణ మంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తాయి. ఇందులో నిజమెంతో అబద్దం ఎంతో కాని బాలు విషయంలో మాత్రం రామోజి ఫిల్మ్ సిటీలో జరిగిన ఆఖరి  షూటింగ్ ప్రాణాల మీదికి తెచ్చిందనేది నిజం.. ఈ షూటింగ్ తర్వాతే బాలు కరోనా సోకి అనారోగ్యం పాలు అయ్యాడనేది ఖఠోర సత్యం. ఈ విషయంలో తానేపాపం ఎరుగనని ఇప్పుడు రామోజి రావు క్లారిటీ కోసం వివరణ ఇచ్చుకున్నా చాలా మంది నమ్మే స్థితిలో లేరు. వాస్తవంగా రామోజి రావు బాలు ఇద్దరు అత్యంత సన్నిహితులు. బాలుకు ఏ కష్టం వచ్చినా  రామోజి రావు నేనున్నానంటూ ఆదుకునే వారని అంటారు. బాలు సినిమాల్లో కమర్శియల్ గా పాడటం అపి వేసిన తర్వాత ఆయన పూర్తిగా ఈటివి కార్యక్రమాలకు అంకితం అయ్యాడు. ఎంటర్ టైన్ మెంట్  ఛానెళ్ళ పోటీ లో ఈ టివి ఒకప్పుడు బాగా వెనుక పడి పోగా బాలు సారద్యంలో నిర్వహించిన స్వరాభి షేకం,  పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు  ఎంతో ఆదరణ పొందాయి. బాలు కారణంగానే ఈటీవి రేటింగ్ లో పోటీ తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు.  బాలు కూడ ఈ కార్యక్రమాలతో  ఓ వెలుగు వెలిగి అందిరి హృదయాలలో నిలిచి పోయాడు. బాలు మరణానంతరం రామోజి ఆంతరంగంలో ఎంత  మదనపడ్డారో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన తన సంస్థ విషయంలో చంఢా శాసనుడనే విషయం అందరికి తెల్సు. తన సంస్థల ఎదుగుదల కోసం ఎందరో రక్త మాంసాలు ఇట్లా ధారగా పోస్తేనే రోమోజి కీర్తి పతాకం రెప రెప లాడగలిగింది.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు