బీహార్ లో పిడుగుల భీభత్సం - ఒకే రోజు 83 మంది మృతి

బీహార్ లో పిడుగుల భీభత్సం
భీహార్ లో గురువారం ఉదయం నుండికురిసిన పిడుగుల భీభత్సానికి 83 మంది బలయ్యారు. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ పలు చోట్ల భారి ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పిడుగులు కురిసాయి. రాష్ర్ట విపత్తు సంస్థ 24 గంటలలోపు మరణించిన వారి వివరాలు వెల్లడించింది.  మొత్తం 83 మంది ఉదయం నుండి సాయంత్రం వరకు పిడుగుల భారిన పడి చనిపోయినట్లు ప్రకటించింది. రాష్ర్టంలో ని గోపాల్ గంజ్ లో అత్యదికంగా 13 మంది, పిడుగు పాటుకు ప్రాణాలు కోల్పాయారు.అసమ్ లో ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయారు.బక్సర్ లో నలుగురు, రంగాబాద్ లో ఇద్దరు, నలందలో ఇద్దరు చనిపోయారు. పిడుగులు పడి చనిపోయిన సంఘటనలపట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర ధిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
బీహార్ లో మరో ఐదు రోజుల పాటు భారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో పలు రాష్ర్టాలలో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు. గత ఏడాది కూడ జూలైలో పిడుగులు కురిసి 36 మంది చనిపోయారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు