రవి గాంచని.. ఆ కుంచె ఎంచని.. అందమే లేదు!

 

రవి గాంచని..
ఆ కుంచె ఎంచని..
అందమే లేదు!


  ( రవివర్మ జయంతి)


రవివర్మకే అందని

ఒకే ఒక అందానివో..


కవి ఆ సినిమాలో

సందర్భాన్ని అనుసరించి

అలా రాసాడేమో గాని..

నిజానికి రవివర్మకి 

అందని అందమే లేదు..


ఆ రవి గాంచని 

చోటును సైతం

ఈ రవి గాంచి..

తన కుంచెకు పని చెబితే

అందమైన భామలు..

లేత మెరుపు తీగలు

అలా కాన్వాసుపై 

చీర కట్టి చేరి

కొసరి కొసరి మురిపించరా..

మైమరపించరా..!


రవివర్మ చిత్రాలు

భారతీయతకు ఆకృతులు..

పురాణాలు చెప్పని కృతులు..

దక్షిణాది సంస్కృతీ శిల్పాలు..

గోడలపై కొలువై ఉండే

కలికాలపు వేల్పులు..!


మన పురాణాల్లోని అమ్మలు

అలా కట్టెదుట నిలబడినట్టు..

అది రవివర్మ కనికట్టు..

కుంచె పడితే

అందమైన బొమ్మ పడినట్టే..

పు"రాణు"లు..

ఇతిహాసాల నాయికల 

మందహాసాలు..

దక్షిణాది సోయగాలు..

బొమ్మల్లో రాగాలు..

నాయికల నయగారాలు..

అందమైన నయాగరాలు..

రవివర్మ చిత్రాలు..

అలరించే చైత్రాలు..!


సురేష్..9948546286

[7:45 am, 30/4/2024] Sureshkumar Elisetti: నీలోని నిప్పు శ్రీశ్రీ! 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు