అందరివాడు అంబేద్కర్ ఆశయ సాధనతోనే సమసమాజ స్థాపన

 అందరివాడు అంబేద్కర్ ఆశయ సాధనతోనే సమసమాజ స్థాపనఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్


    భారతదేశంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేసే ప్రయత్నంలో తన జీవితాన్నే త్యాగం చేసిన అందరివాడు అంబేద్కర్ ఆశయ సాధనతోనే సమసమాజం సాధ్యమవుతుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా  ఆదివారం వరంగల్ జిల్లా ఎంజిఎం నుండి  హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు సాగిన భీమ్ యాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజుతో ఆయన పాల్గొని అంబేద్కర్ కు పూలమాల వేసి మాట్లాడారు. వేల సంవత్సరాలు అణచివేయబడిన శూద్రులకు, మహిళలకు న్యాయం చేయాలని, వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించి సమసమాజం స్థాపించాలని కళలు కని రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపర్చిన అంబేద్కర్ అందరివాడయ్యాడని అలాంటి అంబేద్కర్ ను ఈనాడు కొన్ని వర్గాల ప్రతినిధిగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ బి.సి లకు, మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఎంతో పోరాటం చేశాడని, అప్పటి పాలకులు ఆయనకు అడ్డుపడ్డారని దాంతో అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన నిరసనను వ్యక్తం చేశారని అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు దేశంలో 60 శాతం పైగా ఉన్న ఒబిసి లకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు లేక మెజార్టీ సమాజం అభివృద్ధికి దూరమైందని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి ఎస్సీ, ఎస్టీ లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బహుజన వర్గాలు రాజ్యాధికారం చేపట్టి స్వాభిమానంగా జీవిస్తారని అంబేద్కర్ ఆశించాడని కానీ అందుకు భిన్నంగా నేడు అణగారిన వర్గాలు బ్రాహ్మణీయ ఆధిపత్య పార్టీలల్లో బానిసలుగా జీవిస్తున్నారని అన్నారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ లు మైనార్టీ కావడం వల్లనే బానిసలుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని, చట్టసభల్లో ఒబిసి లకు వాటా ధక్కిననాడే బహుజనుల సంఖ్య పెరిగి అంబేద్కర్ కళలు కన్న సమసమాజం ఏర్పడుతుందని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగంతో ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తున్న బిజెపిని అణగారిన వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమానికి దళిత బహుజన సంఘాలు, ప్రగతిశీల సంఘాలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.     ఈ కార్యక్రమంలో విముక్త చిరుతల కక్షి తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, కార్యనిర్వహక అధ్యక్షులు మచ్చ దేవేందర్, ఎఐఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పెరమాండ్ల రామకృష్ణ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, న్యాయవాదులు నిమ్మాని శేఖర్ రావు, కూనూరు రంజిత్ గౌడ్, విష్ణు వర్ధన్, యెగ్గడి సుందర్ రామ్, జె జె స్వామి, కలకోటి మహేందర్, అన్వేష్, వివిధ సంఘాల నాయకులు సింగారపు అరుణ, మన్నె బాబురావు, మర్రి ప్రభాకర్, మిద్దెపాక ఎల్లన్న, రాజు యాదవ్, బనుక సిద్ధిరాజ్ యాదవ్, కన్నం సునీల్, దొమ్మాటి ప్రవీణ్ కుమార్, శంకర్ నారాయణ, వల్లాల జగన్ గౌడ్, తాడిశెట్టి క్రాంతి కుమార్, కార్తీక్, రాజేశ్వర్ రావు, దిడ్డి ధనలక్ష్మి, పద్మజాదేవి, చెన్న శ్రావణ్ కుమార్ తదిరులు పాల్గొన్నారు.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు