వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా చట్టం చేయాలి

 


వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా చట్టం చేయాలి


తెలంగాణ మేధావుల ఫోరం


రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ సభ్యులు డాక్టర్ రియాజ్ కు వినతి


   భారతదేశంలో 70 శాతం పైగా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా మార్చి చట్టం చేయాలని తెలంగాణ మేధావుల ఫోరం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇటీవల  తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ మానిఫెస్ట్ కమిటీ సభ్యులుగా నియమించబడిన   డాక్టర్ ఎం.డి. రియాజ్ ను తెలంగాణ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె వీరాస్వామి నాయకత్వంలో శనివారం హన్మకొండ జిల్లా కేంద్రం ఎక్సయిజ్ కాలనీ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్ప గుచ్చంతో సత్కరించి అభినందనలు తెలిపిన సందర్బంగా వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంగా చట్టం చేయాలని వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేసారు.

   ఈ సందర్బంగా డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ తెలంగాణ మేధావుల ఫోరo అసెంబ్లీ ఎన్నికలకు ముందు కెసిఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ అనే పుస్తకాన్ని ముద్రించి టిపిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింప చేయడమైందని, గత పది సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో జరిగిన దోపిడి, భూ కబ్జాలు, మిషన్ భఘీరధ, మిషన్ కాకతీయ, విద్యా వ్యవస్థ, వైద్య రంగం, దళిత బంధు, రైతు బంధు, గొర్రెల పథకం, చాపల పథకం లాంటి అనేక పథకాల ద్వారా జరిగిన అవినీతినీ వివరాలతో సహా వాస్తవాలను వెళ్ళడించి తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడంలో ప్రధాన భూమిక పోషించి దోపిడి ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రావడానికి ఫోరం ఎంతో మేలు చేసిందని అన్నారు. ఆ అంశాలు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారంగా ఉపయోగ పడుతాయని అన్నారు. తనకు చేసిన సత్కారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరిచ్చిన విలువైన, దేశ రైతుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వ్యవసాయ రంగానికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్న అంశాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీకి వివరించి కాంగ్రెస్ తరపున రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి, కోశాధికారి అక్కినపల్లి వెంకటేశ్వర్లు, కమిటి సభ్యులైన డాక్టర్ టి సంజీవ్, సాయిని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు