పి.వీకి భారత రత్న అవార్డు - అందుకున్న ఆయన కుమారుడు ప్రభాకర్ రావు

 


దివంగత మాజి ప్రధాన మంత్రి పీ.వీ.నరసింహారావుకు ప్రకటించిన  భారత రత్న అవార్డును  శనివారం ఆయన కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు రాష్ర్ట పతి ద్రౌపది ముర్ము చేతులు మీదిగా అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో భార‌త‌ర‌త్న అవార్డుల ప్ర‌ధాన కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వహించారు. 


 పీవీ న‌ర‌సింహారావు త‌ర‌పున ఆయ‌న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్, క‌ర్పూరీ ఠాకూర్, స్వామినాథ‌న్ కుటుంబ స‌భ్యులు కూడా భార‌త‌ర‌త్న అవార్డు అందుకున్నారు. చ‌ర‌ణ్‌సింగ్ త‌ర‌పున ఆయ‌న మ‌నువ‌డు జ‌యంత్ సింగ్, స్వామినాథ‌న్ త‌ర‌పున ఆయ‌న కుమార్తె నిత్యా రావు, క‌ర్పూరీ ఠాకూర్ త‌ర‌పున ఆయ‌న కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ భార‌త‌ర‌త్న అందుకున్నారు. రేపు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని మోదీ ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి భార‌త‌ర‌త్న అవార్డు ప్ర‌దానం చేయ‌నున్నారు.


ప‌లు రంగాల్లో విశేష కృషి చేసిన ఐదుగురికి ఇటీవ‌లే కేంద్రం భార‌త‌ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. భార‌త మాజీ ప్ర‌ధానులు పీవీ న‌ర‌సింహారావు, చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎల్‌కే అద్వానీ, బీహార్ మాసీ సీఎం క‌ర్పూరీ ఠాకూర్, హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు స్వామినాథ‌న్‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు