శాంతి కోసం నీరు - జల దినోత్సవం సందర్బంగా కిట్స్ లో సెమినార్

 


ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా "శాంతి కోసం నీరు" అనే అంశంపై కిట్స్ వరంగల్ లో సెమినార్‌  నిర్వహించారు. 


డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం (సిఈ), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్  (కిట్స్‌డబ్ల్యు) మరియు ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) వరంగల్  వారు  సంయుక్తాధ్వర్యంలో   సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో "శాంతి కోసం నీరు"(వాటర్ ఫర్ పీస్) అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు.


 ముఖ్య అతిథిగా ప్రధానవక్తగా  నిట్ వరంగల్  ప్రొఫెసర్ ప్రొఫెసర్ యన్ వి. ఉమామహేష్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, స్థిరమైన నీటి నిర్వహణ మరియు సమీకృత నదుల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.  నీరు జీవితం యొక్క డ్రైవర్ అని సమాజ ప్రయోజనం కోసం ఉత్తమ ఇంజనీరింగ్ పద్ధతులలో కాకుండా రివర్స్ పద్ధతి లో  నిర్వహించాలన్నారు.  నీరు మరియు శాంతి ఒకదానికొకటి అంతర్గతంగా బలంగా  అనుసంధానం అయి కట్టుబడి ఉంటాయన్నారు. 1980లో మునిసిపల్ నీటి వినియోగం 1% అయితే 2050 నాటికి ప్రస్తుత స్థాయి కంటే 20-30 శాతం పెరగవచ్చన్నారు. నీటి ఒత్తిడి 700 మెట్రిక్ క్యూబ్‌లు/వ్యక్తి/సంవత్సరం అని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. కానీ దాని కంటే తక్కువ ఉంటే అది ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటుందని  54 శాతం భారతీయులు అధిక నీటి ఒత్తిడి స్థాయిలను ఎదుర్కొంటున్నారని అన్నారు. 

స్థిరమైన అభివృద్ధిలో సమాజం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అనే అంశాలు ఇమిడి ఉంటాయని సమీకృత విధానంలో కూడా పర్యావరణం మరియు పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధి, పాలన మరియు సామాజిక అభివృద్ధి పొందు పరిచ బడి ఉంటాయని అన్నారు. ప్రజల మధ్య సమానమైన నీటి పంపిణీ తో పాటు సురక్షితమైన మంచినీరు  అందాలని  అన్నారు. నీటి వనరులు, పర్యావరణాన్ని పాడుచేయకుండా భవిష్యత్తు తరాల కోసం కాపాడాలన్నారు.




కళాశాల చైర్మన్ మాజి రాజ్య సభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గం మాజి ఎమ్మెల్యే కళాశాల అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ సెమినార్ నిర్వాహకులను అభినందించారు.

  


ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధిసాంకేతిక అంశంలో విద్యార్థులు చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రశ్నలను లేవనెత్తడంతో ఈ సెషన్ సందేశాత్మకంగా, ఇంటరాక్టివ్‌గా సాగిందన్నారు. 

ఈ కార్యక్రమంలో అకడమిక్‌ అఫైర్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె. వేణుమాధవ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇంచార్జి హెడ్, సి.ఈ విభాగం, డాక్టర్‌ డి. హరికృష్ణ, ఐఈ(ఐ), డబ్ల్యూఎల్‌సీ చైర్మన్‌, ప్రొఫెసర్‌ ఎ. రామచంద్రారెడ్డి, ఎంఐఈ గౌరవ కార్యదర్శి డాక్టర్‌ ఎ.వి.గిరిధర్‌ , హెడ్, ఫిజికల్ సైన్సెస్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, పీఆర్వో డా. డి.ప్రభాకరా చారి, ప్రొఫెసర్లు వరుసగా  డా యం. వీరా రెడ్డి,  ప్రొఫెసర్. ఎల్. సుధీర్ రెడ్డి, డా యం. శ్రీకాంత్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్, డాక్టర్ తేజ అభిలాష్, సి.హెచ్. శ్రీధర్; సీఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కె. సృజన్ వర్మ, ఎ. భాస్కర్, డాక్టర్ గంగాధర్ రెడ్డి, స్రవంతి, మానస, అధ్యాపకులు, సిబ్బంది,  విద్యార్థులు  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు