పేరులో విజయం.. దర్శకురాలిగా దిగ్విజయం..!

 


పేరులో విజయం..

దర్శకురాలిగా దిగ్విజయం..!


ఆమె ఏ ముహూర్తాన అందో

అత్త కడుపు చల్లగా

అమ్మ కడుపు చల్లగా

బతకరా బతకరా పచ్చగాని..

ఆ నోటి చలవతో 

అలాగే పచ్చగా బ్రతికేసాడు 

సూపర్ స్టార్ కృష్ణగా..!


విజయనిర్మల..

ఎన్టీఆరే ముద్దుగా కృష్ణా

అని పిలుచుకున్న

ముకుందా మురారి..

దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు 

సొంతం చేసుకున్న వీరనారి..

కృష్ణ విజయాలకు ఆమె సాక్షి..

ఆమె ప్రస్థానానికి ఘట్టమనేని

కుటుంబమే రక్ష..!


కృష్ణ..విజయనిర్మల 

అదో హిట్టు జంట..

ఇద్దరికి ఇద్దరూ హేమాహేమీలే..

తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన పెయిర్..

కలిసి నటిస్తే 

అరుదే ఫెయిల్యూర్..!


ఏ సుందరిలో 

కానరాని సోయగాలు..

ఏ వయ్యారిలో లేని  అందచందాలు..

తనలోనె చూసి..

మనసార వలచి

వరించి కృష్ణుడు

తానే అర్జనుడై 

సుమశరుడే పురోహితుడై

శుభముహూర్తమే 

నిర్ణయించగా మనువాడి

నిన్నమొన్నటి వరకు

కళ్ళలో కళ్లుంచి

కాలమే కరిగించి

సాగించారు పండంటికాపురం..!


గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న

మహిళా దర్శకురాలు

విజయనిర్మల జయంతి..

20.02.1946


ఎలిశెట్టి సురేష్ కుమార్

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు