ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ - ఉద్యోగం ఊస్ట్
వెలంవెర్రి వెడ్డింగ్ షూట్
ఓ వైద్యుడి వేలం వెర్రి ఇది. వైద్య వృత్తి ప్రమాణాలకు విరుద్దంగా ఆపరేషన్ థియేటర్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాడు. వెరైటీగా ఉండాలని ఈ మద్య కాలంలో కొత్తజంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ లో వెర్రి వేశాలు వేయడం ఎక్కువై పోయింది. ఈ సదరు డాక్టర్ కూడ అదే పని చేసి బుక్ అయ్యాడు.
కర్ణాటకలోని చిత్రదుర్గ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ ప్రాతిపాదికన ఓ వైద్యుడు పని చేస్తున్నాడు. అతనికి ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. వినూత్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకున్న అతను.. తన కాబోయే భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చాడు. ఓ డమ్మీ రోగిని బెడ్‌పై పడుకోబెట్టి.. ఆపరేషన్ చేస్తున్నట్లు నటించి.. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్నాడు.
దీన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆపరేషన్ థియేటర్‌లో ఫొటోషూట్ ఏంటని నెటిజన్లు మండిపపడ్డారు.
దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వైద్య శాఖాధికారి రేణు ప్రసాద్ వివరణ ఇస్తూ "నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్‌గా అతన్ని నియమించామన్నారు అయితే ప్రీ వెడ్డింగ్ జరుపుకున్న ఆపరేషన్ థియేటర్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉందన్నారు.
వైద్యుల క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వార్నింగ్ అచ్చారు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఘటన తెలిసిన వెంటనే వైద్యుడిని విధుల నుంచి తొలిగించినట్లు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యం కోసం ఉన్నాయని, వ్యక్తిగత పనుల కోసం కాదని వివరించారు. వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది సహా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ నిబంధనల ప్రకారం పని చేయాలని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని అధికారులను ఆదేశించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box