కేంద్రమంత్రి పదవిపై_అశోక్ గజపతి రాజు కన్ను..!


 కేంద్రమంత్రి పదవిపై

అశోక్ కన్ను..!_


తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు మళ్లీ కేంద్రమంత్రి కావాలని కోరుకుంటున్నారా..

ఏమో..బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఖరారైతే

అశోక్ మరోసారి విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని అనుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం..బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య

పొత్తు కుదిరితే..అప్పుడు తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయితేనే ఇదంతా సాధ్యం.

అదే జరిగి..విజయనగరం స్థానం నుంచి అశోక్ గెలిస్తే

అప్పుడు ఆయన్ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోడానికి నరేంద్రమోడీకి అభ్యంతరం ఉండకపోవచ్చు.

గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ బిజెపి

కూటమి నుంచి వైదొలగినప్పుడే అశోక్ గజపతిని ఉందిపోవాల్సిందిగా మోడీ కోరినట్టు వార్తలు ఉన్నాయి.అశోక్ అంటే మోడీకి ప్రత్యేక అభిమానం..గౌరవం ఉన్నాయి.2019 ఎన్నికల తర్వాత కూడా అశోక్ ఢిల్లీలో

శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు మోడీ అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయించారని అంటారు.అలాంటి అశోక్ కు

మరోసారి కేంద్రంలో చోటు ఇవ్వడానికి మోడీ సుముఖంగానే ఉంటారని 

భావించవచ్చు.. !


మరి..అశోక్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగితే ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పరిస్థితి ఏంటి..

ఆమెకి అప్పుడు విజయనగరం అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుందా..ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన అశోక్ ఖాందాన్ కి కూడా వర్తింప

చేస్తే ఇక అదితికి బ్రేక్ పడినట్టే.అప్పుడు మీసాల గీతకు అవకాశం దక్కవచ్చు.


ఇదిలాఉండగా ప్రస్తుతం బిజెపి,తెలుగుదేశం పార్టీల నడుమ సయోధ్య చర్చల

కీలక పరిణామం ఒక కొలిక్కి రాకపోయినా పరిస్థితులైతే సానుకూలంగానే ఉన్నాయని 

తెలుస్తోంది.

ఇప్పుడు ఈ చర్చలు ఉభయ పక్షాలకు అవసరమే.రేపటి ఎన్నికల్లో బిజెపి కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంతగా ప్రచారం

జరుగుతున్నా మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితం కమలం పార్టీకి కొంత గుబులు పుట్టించింది.

దక్షిణాదిలో కనీసం యాభై స్థానాలైనా గెలుచుకుంటేనే కేంద్రంలో అధికారం సులభంగా అందుతుందనే లెక్కల్లో బిజెపి ఉందట.

తెలంగాణ,తమిళనాడు,

కేరళ రాష్ట్రాల నుంచి సీట్లు ఆశించే పరిస్థితి బిజెపికి ఉండదు.అందుకే ఆంధ్రప్రదేశ్ లో సీట్ల కోసం ఇప్పుడు బిజెపి తెలుగుదేశం పార్టీతో

మైత్రికి సిద్ధపడింది.

కమలనాథులు ఇటీవల రాష్ట్రంలో జరిపించుకున్న

సర్వేలను అనుసరించి

టిడిపితోనే మైత్రికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


ఇదంతా బిజెపి..టిడిపి చర్చల సానుకూలతపైనే

ఆధారపడి ఉంటుంది.


*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*

జర్నలిస్ట్,విజయనగరం

    9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు