ఎపిలో అన్నా చెల్లెల్ల ఆట మొదలు

 


ఆంధ్ర ప్రదేశ్ లో అన్న చెల్లెల్ల రాజకీయం రస కందాయంలో  పడింది. ఎన్నికలు సమీస్తున్న సమయలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారిపోతున్న తరుణంలో కాంగ్రేస్ పార్టి రథ సారధిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహోదరి వై.ఎస్ షర్మిల నియమితులు కావడం కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ ఏఐసిసి మంగళవారం ఉత్తర్వులు జారి చేసింది. ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన గిడుగు రుద్రరాజు పార్టి ఆదేశంతో పదవికి రాజీనామా చేసిన మరుసచటి రోజే షర్మిల పార్టి అద్యక్షురాలిగా నియమితులు అయ్యారు.  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సంతానంగా కుమారుడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి. కూతురు వై.ఎస్.షర్మిల ఇద్దరూ రాజకీయాలలో వారసత్వాన్ని అందుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుని పరిస్థితులు అనుకూలించక పోగా ఆఖరికి అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని జైళు కెళ్లాల్సి వచ్చింది. 

రాష్ర్టం విడిపోయిన తర్వాత కూడ తొలి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ జగన్ కు దక్కలేదు. రెండో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకు జగన్ కు పొసగ లేదు. దాంతే షర్మిల ఎపి రాజకీయాల్లో ఉండ లేక తెలంగాణ  బాటపట్టి వై.ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పేరిట బాగా కష్టపడ్డప్పటికి తెలంగాణ ప్రజల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించ లేదు. షర్మిల ఒక రకంగా తెలంగాణ లో విఫలం అయ్యారు. 

దాంతో ఆమె 2023 లో జరిగిన ఎన్నికల్లో వ్యూహం మార్చి కాంగ్రేస్ పార్టీకి మద్దతు పలికారు. అయినా ఆమెకు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రేస్ పార్టి తరపున ప్రవేశం  లభించ లేదు. తెలంగాణ పార్టి అధ్యక్షులు ప్రస్తుత తెలంగాణ సిఎం  రేవంత్ రెడ్డి షర్మిలకు తెలంగాణ లో కీలక భాద్యతలు దక్కకుండా తన పలుకుబడిని ఉపయోగించారు. దాంతో ఏఐసిసి షర్మిలను బుజ్జగించి ఎపికి అయితే ఒకే చేస్తామని చెప్పడంతో షర్మిల కూడ అక్కడి భాద్యతలు సీవ్కరించక తప్పలేదు. మామూలు స్థానాలు ఇస్తే సరిపోదని ఏకంగా పార్టి నాయకత్వ భాద్యతలే కావాలని షర్మిల అడగడం కాంగ్రేస్ పార్టి అధిష్టానం చివరికి ఒప్పు కోవడం జరిగి పోయాయి.   

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అసలు ఆట మొదలైంది. అన్నా చెల్లెల్ల మద్య రాజకీయ వైరం ఏ మేరకు పతాక స్తాయికి చేరనుందో అనేది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం పార్టి జనసేన ఇప్పటికే పొత్తు కుదుర్చుకుని జగన్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరో వైపు బిజెపి జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. టిడిపి, జనసేనతో కలవడమా లేక జగన్ తో సయోధ్యగా ఉండడమా అనేది తేల్చుకోవాల్సి ఉంది.

మొత్తానికి పొత్తులు కుదరక పోతే వచ్చే ఎన్నికల్లో  ఎపిలో బహుముఖ పోటి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కృతజ్ఞతలు తెలిపిన షర్మిల

"ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాణికం ఠాగూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అంటూ షర్మిల ఎక్స్ లో పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు