నూతన సంవత్సరం అంటే...

 నూతన సంవత్సరం అంటే...



క్యాలెండర్ కొత్త రూపు..

ముందు రోజు రాత్రి

కొంత ఊపు..

కాసింత కైపు..

ఇంటికి వచ్చే వరకే 

నువ్వు తోపు..

వచ్చాక ఓ తాపు..

తీరిపోయే తీపు..!


ఇప్పటికి గడిచినవి 2023..

మిగిలిన లెక్క 

నీకూ నాకూ

అందేది కాదు..

ఉన్నంతవరకే 

ఈ లెక్కల చిక్కు..

మూన్నాళ్ళ జీవితం కోసం

ఎందుకంత పుర్రాకు..!


ఓ 365 పోక..

మరో 365 రాక..

నిరుటి లాభనష్టాలు..

రేపటి కష్టసుఖాలు..

ఆడిటరే అవసరం లేని

అకౌంటింగ్..

ఏయేటికాయేడు 

జీవితం డిటో..

బ్యాలెన్స్ షీట్ సూమోటో..!


నువ్వు చేసే మంచి..క్రెడిట్..

చెడు డెబిట్..

సరిపెట్టకు ఆ లెక్క..

క్రెడిట్ ఎక్కువుంటే బెటర్..

లేదంటే చిత్రగుప్తుడి చిట్టాలో

తేలిపోయే మ్యాటర్...!


గడచిన ఏడాదిపై చేస్తే 

సింహావలోకనం..

తప్పులు చేసి ఉంటే దిద్దుకో..

మళ్లీ చేయకుండా చూసుకో

ఒప్పులే చేస్తే 

మరిన్ని ప్లాన్ చేసుకో..

నువ్వు చేసే మంచి

నిన్ను కాచే కంచె...!


అన్నట్టు..

ఎన్నికల సంవత్సరం..

మారని తరం..

మద్యం నిరంతరం..

నిన్ను మాయచేసి..

మంత్రమేసి..

ముంచేసే నాయకులు..

చుట్టేస్తారు..

చుట్టుముట్టేస్తారు..

కొత్త నంవత్సరం పూట

మంచి నిర్ణయం తీసుకో..

నోటుకు ఓటు అమ్మక

మంచి చేసే నేతను ఎన్నుకో..

న్యూ ఇయర్లో 

బే ఫికర్ బతికెయ్..!



నూతన సంవత్సర శుభాకాంక్షలతో..


        సురేష్ elisetty

            9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు