వంద రోజుల్లో హామీలు అమలు చేయక పోతే కాంగ్రేస్ ను ప్రజలు బొంద పెడ్తారు - కెటిఆర్

 


కాంగ్రేస్ పార్టి అలవి కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. అర్ద సత్యాలు అసత్యాలతో బిఆర్ఎస్ పార్టీ పైనా కెసిఆర్ పైనా దుష్ప్రచారం చేసి గెలిచిందన్నారు. 

బుధవారం తెలంగాణ భవన్ లో  ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశం అనంతరం కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రేస్ పార్టి అనేక  హామీలు ఇచ్చిందని వీటిలో ఫోర్ ట్వెంటీ  హామీల పేరిట బుక్ లెట్ విడుదల చేశారు. వీటిని ఇంటింటికి పంచుతామని కెటిఆర్ అన్నారు. ఎంతగా తమపై దుష్ప్రచారం చేసినా తెలంగాణ ప్రజల కోసంమే తమ పార్టి ఉందన్నారు.  కెసీఆర్ తో తెలంగాణ కున్న అనుభందాన్ని ఎవరూ వేరు చేయలేరన్నారు. కెసిఆర్ అంటేనే తెలంగాణ అన్నారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో  ప్రజలకు వివరిస్తామన్నారు. 

బీఆర్‌ఎస్‌ నాయకులనే  పార్లమెంట్‌ ఎన్నికల్లో  గెలిపించాలో చెబుతామన్నారు.  ఏ కారణం చేత ఓటు వేయాలి ? బీఆర్‌ఎస్‌ ఎంపీలను ఎందుకు గెలిపించాలంటే.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలన్నారు. తెలంగాణ అన్న మాట ధైర్యంగా ఉచ్చరించబడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడాలంటే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాక అవసరమైతే నిలబడాలి.. కలబడాలంటే అది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీతో మాత్రమే సాధ్యమన్నారు. 


తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధిగా   బీఆర్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదన్నారు. గత పదేళ్ల కార్యాచరణ చూస్తే పార్లమెంట్‌ లో తెలంగాణ అనే మాట ప్రతి సమయంలో ప్రతిధ్వనించిందంటే.. దానికి బీఆర్‌ఎస్‌ ఎంపీలే కారణమన్నారు.  బీఆర్‌ఎస్‌ వల్లే ఢిల్లీలో తెలంగాణ  అనే మాట మారు మోగిందని ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. బిఆర్ఎస్ పార్టి  కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ తమకు  ప్రధాన కేంద్రం హైదరాబాదే నని, తెలంగాణ సమస్యలే తమకు ప్రధానమన్నారు. తమ పార్టి ప్రధాన ఎజెండానే తెలంగాణ కాబట్టి.. తెలంగాణ కోసం.. సమస్యలు, హక్కులు, వాటాల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది.. బలంగా కృషి చేయగలిగేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అన్నారు.తెలంగాణ బలం, గళం, దళం బీఆర్‌ఎస్‌ అన్నారు.  పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నా.. ఏ అంశం లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది.. పోరాడగలిగేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అన్నారు.

ప్రతి పార్టీకి ఓ ప్రత్యేకమైన అస్థిత్వం..

ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఓ ప్రత్యేకమైన రాజకీయ అస్థిత్వం ఉంటుంది. ప్రతి పార్టీకి ఓ ప్రత్యేకమైన అస్థిత్వం ఉంటుంది. ఆ రాష్ట్రానికి గుర్తింపును.. గౌరవాన్ని తెచ్చే లీడర్‌ ప్రతి రాష్ట్రానికి ఉంటారు. సొంత బలంతో, గట్టి గళంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. అలా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది. బెంగాల్‌లో అనగానే గుర్తించేది మమతా బెనర్జీ. తమిళనాడు అనగానే గుర్తుకు వచ్చేది డీఎంకే స్టాలిన్‌.. లేదంటే అన్నా డీఎంకే పార్టీ గుర్తుకు వస్తుంది. ఏపీ అంటే గుర్తుకు వచ్చేది జగన్‌.. చంద్రబాబు నాయడు. అక్కడ రెండు పార్టీలదే అక్కడ ప్రభావం ఉన్నది. ఒడిశా అనగానే గుర్తుకు వచ్చేది నవీన్‌ పట్నాయక్‌. బీహార్‌ అంటే గుర్తుకు వచ్చేది నితీశ్‌ కుమార్‌, తేజస్వీ యాదవ్‌, మహారాష్ట్ర అనగానే గుర్తుకు వచ్చేది శరద్‌ పవార్‌, ఉద్దవ్‌ ఠాక్రే. తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది భారతదేశమంతా వెంటనే స్ఫురించే పేరు, గుర్తుకు వచ్చే రూపం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌’ అని తెలిపారు.

కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చింది..

ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని మాట్లాడినా నిర్వివాదమైన అంశం.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదు. పవర్‌ఫుల్‌ నేతలతో ఆయా రాష్ట్రాలకు ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. కేసీఆర్‌తో తెలంగాణ అనే రాష్ట్రం వచ్చింది.. ఆ రాష్ట్రానికి అస్థిత్వం వచ్చింది. తెలంగాణ అనే పదానికి పర్యాయపదంగా కేసీఆర్‌ మారారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కోసం 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా.. పార్లమెంట్‌లో ఫోర్త్‌స్థాయి ఎంప్లాయ్‌ నుంచి ప్రధానిమంత్రి దాకా అందరినీ కలిశారు. ఆయనను చూడగానే తెలంగాణ గుర్తుకు వస్తుందనే విధంగా కేసీఆర్‌ ఎక్కని కడప లేదు.. మొక్కని బండ లేదు అన్నట్లు ఆ నాడు విస్తృతంగా ఢిల్లీలో ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లే రాష్ట్రం సాకారమైందని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు