ఉద్యమాల ఝరి - అక్షరాల సిరి - సావిత్రీ భాయి పూలే

 


సంస్కరణల సంసారం!

ఆమె.

పోరాట యోధుడు పూలేకి అర్ధనారీశ్వరి 

మాత్రమే కాదు..

తానుగా పోరాడే మాహేశ్వరి..

*_ఉద్యమాల ఝరి.._*

_*అక్షరాల సిరి..*_

_*స్వచ్చ కావేరి..!*_


*సావిత్రీ భాయి పూలే..*

ఈ పేరు సంస్కరణకు...

తిరస్కరణకు మారుపేరు..

ఎక్కడ దుస్సంప్రదాయం 

ఉంటే అక్కడ తను..

పెను తుపాను..

వితంతు శిరోముండనం..

ఆమెకు నచ్చని తంతు..

ఎదిరించి..ఎదురు నిలిచి..

క్షురకులను 

ఒక త్రాటిపై నిలిపి..

*_రాసింది సరికొత్త లిపి.._*

*_పతితో చేయి కలిపి..!_*


బాల్యంలోనే వివాహం..

భర్తతోనే అహరహం..

*_ఆయన ఆరాటమే_* 

*_తన పోరాటమై.._*

ప్రాణాలతో చెలగాటమై..

అధికులను త్రోసిరాజన్న

పధికురాలై..

ఎందరి జీవితాల్లోనే 

తానే తొలిపొద్దుగా..

రాజీ వద్దంటే వద్దుగా..!


*విద్యలో తొలిగురువు* 

భర్త జ్యోతి..

ఆయన ప్రయాణంలో 

*_తను జీవనజ్యోతి.._*

పోరాటాలతో 

అఖండ ఖ్యాతి..

ఎన్ని అవాంతరాలు ఎదురైనా 

చెక్కుచెదరని 

సేవానిరతి..

మెచ్చింది అఖండభారతి..!


రోజూ రెండువేల మందికి 

*_అన్నం పెట్టిన అమ్మ.._*

*_అక్షరం నేర్పిన టీచరమ్మ.._*

*_వితంతులకు_* 

*_పెళ్లి చేసిన పెద్దమ్మ.._*

పురోహితురాలిగా 

తానే సూత్రధారిగా..

సూత్రం కట్టించిన పేరమ్మ..

*అబ్బో ఎంత..పేరమ్మా..!*


తను నేర్చుకున్న చదువు

పెంచుకున్న పరువు..

తనతోనే ఆగిపోరాదని

భర్త ఆశయం వీగిపోరాదని

_*పోరాటం పథమై..*_

*_సంస్కరణ శపథమై.._*

*_ధైర్యమే ఆయుధమై.._*

సాగిన ధీరవనిత..

జాతి మెచ్చిన

ఆదర్శ నెలత..!

ఎందరి జీవితాల్లోనో

ఆవరించిన చీకట్లను 

పారద్రోలిన తటిల్లత..

*సిసలైన విజేత..!!*


సావిత్రీ బాయి పూలే జయంతి

(03.01.1831)

సందర్భంగా

ప్రణామాలతో..


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

      9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు