పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో కెసిఆర్

 


తుంటి  శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న  మాజి ముఖ్యమంత్రి కెసియ్యార్ తొలిసారిగా పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.

ఎర్ర వెల్లి ఫామ్ హవుజ్ లో జరిగిన పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. 

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై పార్టి ఎంపీలతో చర్చించారు.

జనవరి నెలాఖరు నుండి వారం రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా కెసిఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలకు ధైర్యం నూరి పోసారు.

అసెంబ్లీ ఫలితాలపై సంపూర్ణంగ సమీక్షలు జరుగుతున్నాయని ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి దిద్దు బాటు చేసుకుందామని అన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీ లకు సూచించారు.

నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగు లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు.

నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని  కాపాడలవలసిన బాధ్యత మరోసారి బిఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీలు



రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, 

పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి…వీరితో పాటు పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు