గుంటూరుకారం ఘాటేదీ..!

 


గుంటూరుకారం ఘాటేదీ..!



త్రివిక్రమ్ మహేష్ దగ్గరికి వెళ్ళేడు..
మనం సినిమా చేస్తున్నాం బాబు అన్నాడు..
వెంటనే మహేష్ సంతోషించి
అతడు..ఖలేజా తర్వాత మూడో సినిమా అన్నమాట..గుడ్ అంటూ
మరి కథ..

కథేంటి..
నువ్వే హీరో..
నువ్వే కథ..ఇంకా కథ దేనికి..

నువ్వు ఊ అను మొత్తం సినిమా నీ చుట్టూ..నీతో..
నీ మీద నడిపెయ్యనూ అన్నాడు..
మాటల మాంత్రికుడిపై నమ్మకంతో సరే అన్నాడు సూపర్ స్టార్..

అంతగా గుర్తు పెట్టుకునే పంచ్ డైలాగులు లేకపోయినా శ్రీనివాస్ మార్కు మాటలు కొన్ని..
తల్లీ కొడుకుల సెంటిమెంట్..
అది కూడా అంత సవ్యంగా లేదు..విలన్లు జోకర్లై..
జగపతి బాబు వంటి పెద్ద నటుడు కూడా ఎందుకు ఉన్నాడో తెలియని అయోమయంలో..
చివరికి ఒకటి రెండు ట్విస్టులతో సినిమాని ముగించి ఇది త్రివిక్రమ్ సినిమానా అనిపించాడు
దర్శకుడు..!

నిజానికి ఇది
మహేష్ బాబు బొమ్మ..
తన ఇమేజితో..గ్లామర్ తో..
పాత్ర ఇచ్చిన అవకాశం మేరకు సినిమాని పూర్తిగా తన భుజంపై మోసి
అయిందనిపించాడు సూపర్ స్టార్..అన్నట్టు మరో శివగామి అవుతుందనుకున్న
రమ్యకృష్ణ తల్లి పాత్రలో పెద్దగా కదిలించకపోయినా
మంత్రి క్యారెక్టర్లో హుందాగా
కనిపించింది..

ఇంతకీ కథ చెప్పట్లేదు అనుకుంటున్నారా..
అదే కదా బాధ..
ఆ కథే మిస్సయిందనే 
నా గోల..

హీరో..ఆయనకి చిన్నప్పుడే చెయ్యని నేరానికి
జైలుకి వెళ్ళిన తండ్రి(జయరామ్)..
ఆయన జైలుకి వెళ్ళగానే కొడుకుని వదిలేసి
తండ్రి వద్దకు
వెళ్ళిపోయి
రెండో పెళ్లి(రావు రమేష్)చేసుకున్న అమ్మ(రమ్యకృష్ణ)..
తల్లి నుంచి వారసత్వ హక్కు వదులుకొమ్మని మనవణ్ణి రకరకాలుగా వేధించే తాత(ప్రకాష్ రాజ్)..
వీళ్ళ చుట్టూ నడిచే సినిమాలో అందానికి..ఐటెం సాంగుకి మాత్రమే తెరపై మెరిసిన నాయిక(శ్రీ లీల)..
ఒక పనికిమాలిన ప్లీడరు(మురళీ శర్మ)..
ఆయనకి ఓ పనికిరాని
అసిస్టెంట్(వెన్నెల కిశోర్) వీళ్ళ చుట్టూ సినిమాని
నడి పేసాడు త్రివిక్రమ్.
మధ్యలో యధావిధిగా పాటలు.. ఫైట్లు..
పోలీసులను ఎందుకూ పనికిరాని వాళ్ళుగా చూపించే సన్నివేశాలు..
చివరికి తల్లి పాత్ర రెండో పెళ్లి చేసుకున్నా అంతా కొడుకుని కాపాడుకోవడానికే అని చూపించి తల్లి
సెంటిమెంటుతో సినిమాని ముగించి అత్తారింటికి దారేది
సినిమాలో అత్తని ఇంటికి తెచ్చినట్టు ఈ సినిమాలో రెండో పెళ్లి చేసుకున్న అమ్మని తిరిగి ఇంటికి తీసుకువచ్చి
నాన్న పక్కన కూర్చోబెట్టిన ఘనతని సాధించిన హీరో...

సినిమా మొత్తం హీరో ఎలివేషనే ప్రధానంగా సాగింది..అది బానే ఉంది కానీ మరీ కథలో బలం లేకుండా ఎంత చేస్తే మాత్రం హీరోయిజం పండుద్ది చెప్పండి..చివరికి హీరోని చంపడానికి వచ్చిన విలన్లు కూడా ఆయన హీరోయిజానికి దాసోహం అయిపోయి ఆయన వైపే తిరిగి పోవడం.. ఏంటో త్రివిక్రమ్ ఆలోచన..ఆయన మార్కు కథా లేదు.. డైలాగులూ లేవు..పాటలూ పెద్దగా ఆకట్టుకోలేదు..
ఉన్నదల్లా ఎంత ప్రమాదాన్నయినా ఇట్టే ఎదుర్కొనే హీరో..
ఆయన తండ్రి నీరో..
విలన్లు జీరో..
తాత మారో..
హీరోయిన్ సీన్ సితారో..
మహేష్ బాబు మాటిమాటికీ
దమ్మారో..!

సినిమా చివరన హీరో
ఒక డైలాగ్ సెబుతాడు..
నేను రెబల్..నాకు అమ్మలు డబుల్(రమ్యకృష్ట..ఆమె వదిలేసి వెళ్లిపోతే పెంచిన మేనత్త భువనేశ్వరి)..అదే పంచ్ డైలాగ్ అనుకున్నాడేమో త్రివిక్రమ్..
దాన్నే ఇంకాస్త పొడిగిస్తే నాన్నలు కూడా డబుల్(ఒకరు అసలు..మరొకరు డమ్మీ)..
హీరోయిన్ సెక్స్ సింబల్..!

మొత్తానికి
గుంటూరుకారంలో
ఘాటు మిస్సయింది..
నాటు ఎక్కువైంది..
సెంటిమెంటు యాంటీ సెంటిమెంటు గా కనిపించింది..తల్లికి ఇద్దరు భర్తలు.. అలా రెండు పెళ్లిళ్లు చేసుకోడానికి..
కొడుకుని వదిలేసి వెళ్ళిపోడానికి ఆమె చెప్పిన కారణాలు అంత కన్విన్సింగా అనిపించలేదు..
ఎదురుపడిన
కొడుకుని లాగి కొట్టి ఆనక కొడుకు అలా ఎందుకు కొట్టావమ్మా అని అడిగితే ముట్టుకోవాలని అనిపించింది నాన్నా అని చెప్పటం సినిమా తల్లికి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్..ఎన్ని చూపించినా..
ఎంత ప్రయత్నించినా..
మహేష్ బాబు ఎలా చేసినా..
రేపు కలెక్షన్ల వర్షమే కురిసినా..
ఈ గుంటూరుకారం సినిమా మాత్రం..మాటల మాంత్రికుడా ఏమీ అనుకోవద్దు కాని..
ఇది త్రివిక్రమ్ సినిమా అనిపించలేదు..త్రివక్రం సినిమా ఆనక తప్పడం లేదు..!

                 *_సురేష్.._*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు