షెడ్డులో సిఎం రేవంత్ రెడ్డి కాంపు కార్యాలయం

 


కెసిఆర్ వందల కోట్లు ఖర్చు చేసి  ఇంద్ర భవనం లాంటి బంగ్ల ప్రగతి భవన్ కట్టించుకుని అందులో విలాస వంతమైన జీవితం గడిపారు. కాంగ్రేస్ ప్రబుత్వం అధికారంలోకి వచ్చినంక ఈ భవనాన్ని పూలే ప్రధా భవన్ గా మార్చి ప్రజల విజ్ఞాపనలు స్వీకరిస్తున్నారు. ఇందులో కెసిార్ నివాసంగా వాడుకున్న భవణంలో  డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క  మల్లు  తన  నివాసంగా చేసుకున్నారు.
అయితే సిఎం రేవంత్ రెడ్డి మాత్రం  అందుకు భిన్నంగా విలాసవంతమైన బంగ్లాలకు బదులుగా సింప్లి సిటీ ఎంచుకున్నారు. 

 తాను ఆడంబరాలకు పోదల్చుకోలేదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకొని దుబారాను తగ్గించాలనుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి  మీడియా వారి ఎదుట ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు.

తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఓ ఎకరం స్థలంలో షెడ్డులో ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని.. అందువల్లనే ఒక షెడ్డును కట్టించుకొని దానినే క్యాంపు ఆఫీస్ గా వాడుకుంటానని తెలిపారు.

అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అనవసరపు ఖర్చులను ప్రభుత్వం బాగా తగ్గిస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు జరగాలనేది బీఏసీ నిర్ణయిస్తుందన్నారు. జర్నలిస్టులకు వసతి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నదని.. గత ప్రభుత్వంలో పరిష్కారం దొరక్కుండా ఎక్కడి గొంగళి అక్కడే అనే తరహాలో ఉన్నదని.. త్వరలోనే దీనికి పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ సూచన ప్రాయంగా తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు