తిరుమల శ్రీవారిని మాజి ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు శుక్రవారం కుటుంబ సబ్యులతో కల్సిదర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకి కోలా ఆనంద్, భాను ప్రకాష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రావారి దర్శనం అనంతరం ఆయన వెంగమాంబ అన్నమాంబ సత్రంలో కుటుంబ సబ్యులతో కల్సి అన్నప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలోని వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తుల మధ్య కుటుంబ సభ్యులతో కలసి అన్న ప్రసాదాన్ని స్వీకరించటం ఆనందదాయకం. నిత్యం రుచిగా, శుచిగా వేలాది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్న టీటీడీ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
శ్రీవారికి వచ్చే ఆదాయం ఆలయ పరిసరాల శుభ్రతకు, పురాతన ఆలయాలకు కైంకర్యాలకు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని ఆయన టీటీడీని కోరారు. శ్రీవారి ఆదాయం ప్రతి రూపాయిని తిరుమల అభివృద్ధి కోసమే వాడాలని సూచించారు. ఆలయ నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి నిధులు వాడాలన్నారు. గ్రామాల్లో టీటీడీ సహకారంతో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుమల పేరుతో కళ్యాణ మండపాలు, దేవాలయ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని టీటీడీకి సూచించారు. ధర్మ పరిరక్షణతో పాటు ప్రజలకు ప్రార్థనాలు, ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడానికి తిరుమల శ్రీవారి ఆలయం నిధులు వెచ్చించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం లాంటి కొన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టాలని కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, శ్రీవారి ఆలయం నిధులపై బయటి వ్యక్తులు జోక్యం చేసుకోకూడదని సూచించారు.
రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు ... నేరమయంగా మారుతున్నాయని వెంకయ్య నాయుడు ఆందోళన
ప్రస్తుత రాజకీయాలపట్ల వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. నీతి, నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులను ఎన్నుకోవడం భారతీయ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగుతున్న నేపద్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ సబ్యులతో కల్సివెంగమాంబ సత్రంలో అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న మాజి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు |
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యువత ఓటరు చైతన్యకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓటు లేని వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు.రాజకీయాల్లో అవినీతి పరుల ప్రవేశం పెరిగి పోయిందని వెంకయ్య నాయిడు ఆందోళన వ్యక్తం చేశారు. నీతి నిజాయితీగా నిక్కసుగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. నిజాయితి కలిగిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని దూరం పెట్టాలని అన్నారు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, ధనం చూసి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రజలకు సమస్యలు తప్పవన్నారు. నేతల గుణ గణాలు వ్యక్తిత్వం చూడాలని వాళ్లు చేసే మంచి పనులు చూసి ఓటు వేస్తే మెరుగైన సమాజం ఉంటుందని, లేకపోతే అయిదేళ్ల పాటు ప్రజలు నష్టపోతారని సూచించారు. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షాల నేతలు ఎవరు ప్రజల కోసం ఏం చేశారు, చెప్పిన హామీలు నెరవేర్చా లేదా, మాట నిలబెట్టుకునే వ్యక్తులా కాదా అని చూసి ఓటు వేయాలని ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచనలు చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box