అవినీతి పరులనువదిలే ప్రసక్తి లేదు ..ప్రధాన మంత్రి నరేంద్ర మోది

 


అవినీతి పరులను వదిలే ప్రసక్తి లేదని ప్రజలసొమ్మును కక్కిస్తామని  ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు.

సిఎం కెసిఆర్ పాలనపై మోది విమర్శలు చేశారు. నీళ్ళు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇవేవి పట్టించుకోవడం లేదని ఉద్యోగనియామకాలలో అనేక అవకతవకలు జరిగి పరీక్షలు  రద్దు కావడం రాష్ర్ట ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనమని అన్నారు.

 

ఇదే స్టేడియంలో 2014 లో బి.సి అయిన తనను ఆశీర్వదించి పంపించారని తాను ప్రధానమంత్రి అయ్యానని మోది గుర్తు చేసుకున్నారు.  రాష్ర్టంలో బి.సి ముఖ్యమంత్రి అవుతారని తనకు విశ్వాసం ఉందని అన్నారు.బిజెపి అబ్ధుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిందన్నారు. కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా వున్నారని  పేర్కొన్నారు. లోక్‌సభకు తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది కూడ బీజేపీయేనని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. 


రామ్‌నాథ్ కోవింద్‌ను, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీయేనని ఆయన గుర్తుచేశారు. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది బీజేపీయేనని ప్రధాని తెలిపారు. 


కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదని ఈ రెండూ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన మోసపూరిత రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్షణాలని ప్రధాని తీవ్రంగా విమర్శలు చేశారు. వ్యాఖ్యలు చేశారు. 


బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని .. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమని మోడీ జోస్యం చెప్పారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ యువతను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని మోడీ విమర్శించారు. 


టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజ్.. యువత జీవితాలను దుర్బరం చేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా వున్నాయని.. తప్పు చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోడీ పేర్కొన్నారు. పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం అందిస్తామని, పేదలకు ఉచిత రేషన్ .. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోడీ గ్యారెంటీ అని ఆయన పేర్కొన్నారు. 


తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదని.. తెలంగాణలో మార్పు తుఫాను కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని నియామకాల పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయని మోడీ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు వున్నాయని.. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వారి నుంచి తిరిగి రాబడతామని మోడీ హెచ్చరించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు