పిసా టవర్ కు మేడిగడ్డ బరాజ్ కు లింకెట్లా కెటిఆర్


ఒక బాధ్యత గల మంత్రి. ఇక్కడ పుట్టినవాడే కానీ పూణే లో చదువు కున్నాడు .

అమెరికా లో ఏదో కొలువు చేసుకున్నాడు అనుకోవచ్చు. ఒక మాట తూలే టప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.  మరీ ఇన్ని అబద్దాలు ఇంత బాధ్యతా రాహిత్యం ఒక తెలంగాణ కే కాదు ఏ సమాజానికీ మంచిది కాదు. ఇక పోతే మన కెసిఆర్ కొడుకు చేలల్లో చెలకల్లో నాటు కోడు వండుకో తప్పులేదు  నియ్యతి తప్పి మాట్లాడ కూడదు 

మేడిగడ్డ కూలింది, కుంగింది, కింద ఇసుక కొట్టక పోయింది. 

తెలంగాణ వచ్చాక బి టెక్ చదివినా చదవకున్నా ప్రతి గొట్టం గాడు నిర్మాణాల గురించి వాటి నాణ్యత గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ మధ్య ఒక osd ,నిన్న అస్ఘర్ అలీ ఇంజనీర్ అలియాస్ ప్రకాష్ ఏదో రాసి పరువు తీసుకున్నాడు (ఆయనకు పరువా పాడా) .

కెసిఆర్ అయితే పిట్టని పిల్లలకు పేరు పెడతాడు. ఒకప్పుడు కెసిఆర్ మాట్లాడితే కోట్ల మంది వినేవారు. ఆయన వాగ్ధాటి అలాంటిది.  రాను రాను కెసిఆర్ మాటకు పూచిక పుల్లకు ఉన్న విలువ లేకుండా పోతోంది  నేను దళిత ముఖ్యమంత్రి మాట అనలేదు అంటాడు సోషల్ మీడియా లో అన్నవి అననివి రెండూ కలిపి పెట్టి గాలి తీసారు. 

నేను ఎనభై వేల పుస్తకాలు చదివాను అన్నాడు. అందెశ్రీ రాసిన కోట్ల మందికి తెలిసిన 'జయ జయహే తెలంగాణ 'పాట నేనే రాసిన అన్నాడు. మొన్న ఏదో మీటింగ్ లో 'చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ బొక్కలోంకర పోయిన బ్రతుకు నల్లగొండ'

లక్షల మంది ముందు ఆ పాట నేనే రాసాను అనే అబద్దం ఆడాడు. కోదారి శీను లేదు నేను రాయలేదు కెసిఆర్ రాసిండు అని ఒప్పుకున్నా జనాలు ఒప్పుకోరు కదా ? 

కెసిఆర్ కు ఎవరు ప్రసంగాలు రాస్తున్నారో కానీ పదిహేను ఏళ్ళ కింద ఆయన మాటలు స్వచ్చంగా ఉండేవి. అబద్దాలు చెప్పినా అతికినట్టు ఉండేది. ఏదో సందర్భం లో ఒక గంట మాట్లాడిన గుర్తు.

పక్కన  జోకుడు గాళ్ళు ఎక్కువ అయితే బ్రతుకు ఇలా పజ్జీతుల పాలు అవుద్ది అన్నమాట.

ఇక మన త్విట్టేర్ పిట్ట ktr మరీ చీపు అయిపోయాడు. 

ప్రవలిక చనిపోతే ఆమె అసలు ఏ పరీక్ష రాయలేదు. లవర్ వేదింపుల మూలంగా నే ఉరి వెట్టుకుని  చనిపోయింది అన్నాడు. పాపం ఆ రాథోడ్ అనే పోరగాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. నిన్నో మొన్నో కేసు నిలబడ లేదు అనే వార్త చదివా. అక్కడ కూడా దుంప  నాశనం అయ్యింది తెలంగాణ పాలకుల పరువు.

ఇక మేడిగడ్డ కుంగు బాటు గురించి మొదట విద్రోహ చర్య అన్నారు. తర్వాత అది తన్నింది .ఇప్పుడు ఒక్క పైసా లేకుండా కాంట్రాక్టర్ ఐదేళ్ళు రిపేర్ చేస్తారు ఆల్రెడీ మూడేళ్ళు అయిపొయింది రిపేర్ అయ్యాక ఆ ఐదేళ్ళ కాలం కూడా అయిపోతుంది మరి తర్వాత ?

మొన్న కె నాగేశ్వర్  తో ముఖాముఖి లో పిసా టవర్ పోలిక తెచ్చి పరువు తీసుకున్నాడు. 

మరీ దారుణం ఏంటి అంటే ఇటలీ పిసా టవర్ లాంటిదే కూలింది మేడిగడ్డ ఎంత ఏపాటి అంటున్నాడు. 

మేడిగడ్డ ఒక బరాజ్, పిసా టవర్ ఒక బంగాళా . బంగ్లా కూలితే యజమాని లేదా కొందరు పోతారు . మరి డాం కూలితే ఎంత ప్రజా ధనం ఎన్ని బ్రతుకులు ? ఎంత శ్రమ వృధా ? ఎన్ని ఆశలు కూలిపోవాలి ? 

ఇప్పటికి పిసా టవర్ కట్టి ఆరు వందల యాభై ఏళ్ళు. 

కనీసం ఆరు వందల యాభై ఏళ్ళ కట్టడం నిలబడి వంగి పోతోంది అది కూలినా వంగినా వేల కోట్ల టూరిస్ట్ ఆదాయం వస్తోంది. 

పిసా టవర్ ఆరు వందల యాభై ఏళ్ళు దృడంగా నిలబడ్డ్డది. మనం కట్టింది కనీసం ఆరువందల రోజులు కూడా ఎందుకు నిలబడ లేదు. ?  ఎందుకు కుందింది ?ఎందుకు మునిగింది ? ఎందుకు బుంగలు పడ్డది. ?

పిసా టవర్ గురించి మాట్లాడే టప్పుడు కనీసం గూగుల్ చేసినా ఆబోరు దక్కేది. ఇలా ప్రాస కోసం పనికి మాలిన పోలిక మొదటికే మోసం తెస్తదే రావుల.

మీరే తెలంగాణ కు ఆశ, నిప్పు, నీరు, నిట్టాడి అంటున్నారు. మీరూ లోకేశం ల అయిపోయారె  

బతుకు  పజ్జీతుల పాలు అవుద్దె రావుల. ఆయనకి ఎవరన్నా చెప్పండి

.డా.గుఱ్ఱం సీతారాములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు