వరంగల్ కోటలో హెరిటేజ్ సెలబ్రేషన్ మరియు ఆర్టిస్టిక్ లెగసి

 కిట్స్ వరంగల్ "స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ యొక్క మ్యూజిక్‌, డ్యాన్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎండీఎఫ్‌) క్లబ్ వారు ఫోర్ట్ వరంగల్‌లో హెరిటేజ్ సెలబ్రేషన్ మరియు ఆర్టిస్టిక్ లెగసీని విజయవంతంగా నిర్వహించారు.వరంగల్ లో సాంస్కృతిక, నేచరల్ మరియు మిశ్రమ రకాల వారసత్వం అందుబాటులో ఉందని, దానిని కాపాుకోవడానికి కిట్స్ విద్యార్థి కళాకారులు లైవ్ స్కెచింగ్ ద్వారా చారిత్రక ప్రదేశానికి జీవం పోశారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వెల్లడి


స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (ఎస్‌ఎసి-సాక్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ ( కిట్స్ వరంగల్-కిట్స్ డబ్ల్యు),  స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ మ్యూజిక్‌, డ్యాన్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎండీఎఫ్‌) క్లబ్ ఆధ్వర్యంలో చారిత్రక వరంగల్ కోటలో హెరిటేజ్ సెలబ్రేషన్ మరియు ఆర్టిస్టిక్ లెగసీ అనే ఈవెంట్‌ను నిర్వహించినది అని ప్రిన్సిపల్ ప్రొ. కె. అశోక రెడ్డి తెలిపారు. నవంబర్ 19 నుండి ప్రపంచ హెరిటేజ్ వారోత్సవాల సందర్భంగా భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఇది నిర్వహించబడింది అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థి కళాకారులు లైవ్ స్కెచింగ్ ద్వారా చారిత్రక ప్రదేశానికి జీవం పోశారని, దానిలోని క్లిష్టమైన వివరాలను, గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతను చిత్రీకరించారని తెలిపారు. యు యస్ కె  (అర్బన్ స్కెచర్స్)వరంగల్ తో కలిసి కిట్స్ డబ్ల్యు విద్యార్థులు వరంగల్ కోట వారసత్వంతో లోతైన సంబంధాన్ని పెంపొందిస్తూ, సృజనాత్మక ప్రక్రియలో నిమగ్నమైనారు. ఈ కార్యక్రమం మన ప్రపంచ సాంస్కృతిక సంపదను సంరక్షించడం మరియు ప్రశంసించడం యొక్క ప్రాముఖ్యతకు ఒక శక్తివంతమైన నివాళిగా పనిచేసింది. విద్యార్థులుమల్టీడిసిప్లినరీ ఇంజనీరింగ్ డొమైన్‌లలో కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం వల్ల వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది . ఇది వారి సమస్య పరిష్కార సామర్థ్యాలను, నాయకత్వ నైపుణ్యాలను మరియు విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడానికి దారితీస్తుంది అని సగర్వంగా తెలిపారు.ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ,కిట్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు & కిట్స్ యాజమాన్య సభ్యులు, కోశాధికారి శ్రీ. పి. నారాయణ రెడ్డి మరియు అదనపు కార్యదర్శి & హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ యం డి ఎఫ్ క్లబ్ విద్యార్థి ఆర్టిస్టిక్ లెగసీ నీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ అఫైర్స్, ప్రొఫెసర్ వి.శంకర్‌,  అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు, శ్రీ. ఎం. నరసింహారావు, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్. డి.ప్రభాకరా చారి, వివిధ విభాగాల విభాగాధిపతులు, వివిధ విభాగాల డీన్ లు, ఫ్యాకల్టీ ఇంచార్జిలు: క్లబ్ విద్యార్థి ప్రతినిధులు యు. శ్రీమయి,  వి తనుశ్రీ, కె. త్రిష, ఆవెయీద్ మజ్ హర్, జే. మౌర్య మరియు టి వి ఆర్ యస్ తేజ, విద్యార్థి లీడ్స్, హెచ్. శ్రీ గౌరీ జాహ్నవి, స్నిగ్ధ, దీపక్ శోధన్, సి హెచ్. అక్షిత, శృతి కార్తీక, శ్రావ్యశ్రీ, శ్రీహర్షిత, అధ్యాపకులు, సిబ్బంది కిట్స్ డబ్ల్యు నుండి 70 మంది విద్యార్థులు  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు