వంశీకృష్ణ అచ్యుతకు అమెరికా తానా అవార్డు

 


వంశీకృష్ణ అచ్యుతకు     అమెరికా తానా అవార్డు..MAAsters..(మాస్టర్స్) షార్ట్ ఫిల్మ్ కు అంతర్జాతీయ గుర్తింపు..



విదేశాలలో మన భారతీయ విద్యార్ధుల జీవనస్థితిగతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వంశీకృష్ణ చేసిన కృషికి తగిన గుర్తింపు గా అమెరికా ఫిలడెల్ఫియా లో జరిగిన తానా-2023 కన్వెన్షన్‌లో మొదటి విజేత గా అవార్డు దక్కింది. 16 నిమిషాల నిడివి గల "మాస్టర్స్ షార్ట్ ఫిల్మ్‌" ఎన్నో కోణాలను స్పృశించడం విశేషం. వంశీకృష్ణ పుట్టి పెరిగిన వరంగల్‌లోనే తన బి.టెక్  పూర్తి చేశాక, అమెరికా వెళ్ళి చికాగోలో మాస్టర్స్ చదివాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో DevOps ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
వంశీకృష్ణ సీనియర్ జర్నలిస్ట్ అయిన అచ్యుత రఘునాద్ కుమారుడు.
చిన్నప్పటి నుంచి తనచుట్టూ జరిగే యధార్థ ఘటనలకు స్పందించడం.. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే దృశ్య, శ్రవణ రూపాలకు ప్రాధాన్యత కల్పించడం... అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చిన శక్తివంతమైన ప్రచార మాధ్యమాలను వినియోగించి సమాజాన్ని చైతన్య పరచడం వంటి అంశాలు వంశీకృష్ణ కలం నుంచి జాలువారిన అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. విదేశాల్లోని భారతీయ విద్యార్థులపై జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వంశీకృష్ణ షార్ట్ ఫిల్మ్  తీశాడు. అక్కడికి వెళ్ళిన వారు పడే కష్టనష్టాలు, వలసబతుకుల్లో నెలకొన్న భయానక పరిస్థితులు, దినదిన గండంగా నెలకొన్న దుస్థితిని కళ్ళకు కట్టే రీతిలో... గత అనుభవాలను క్రోడీకరించి... లఘుచిత్రం (Short film) తీయాలన్న ఆలోచనకు ఆచరణ రూపం కల్పించి సక్సెస్ అయ్యాడు మనోడు... ఇలా...కాన్సెప్ట్, రైటర్, డైరెక్టర్, యాక్టర్ గా "మాస్టర్స్" ద్వారా గుర్తింపు దక్కించుకున్న వంశీకృష్ణ తెలుగు వారి ఘనత ను దశదిశలా చాటాడు. అంతర్జాతీయ స్థాయిలో .. అటు అమెరికా.. ఇటు ఇండియా లో ప్రశంసలు అందుకుంటున్న వంశీకృష్ణ అచ్యుత తెలుగు రాష్ట్రాల్లో మూడున్నర దశాబ్దాలు గా అనేక ప్రాంతాల్లో పనిచేసిన సీనియర్ పాత్రికేయులు రఘునాథ్ అచ్యుత కుమారుడు.తాజాగా విడుదలైన ఈ "MAAsters" భారతీయ విద్యార్థుల విదేశీ జీవన స్థితిగతులకు అద్దం పట్టిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

MASTERS SHORT FILM Click Here




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు