కాంగ్రేస్ పార్టీలో జోష్ నింపిన ప్రియాంక, రాహుల్ గాంధి

 




తెలంగాణలో
బీజెపి పని  అయి పోయింది  బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది.... రాహుల్ గాంధీ

తెలంగాణ లో బిజెపి పని అయిపోయిందని బీఆర్ఎస్ గెలవాలనిబీజెపి కోరుకుటుందోని బిఆర్ఎస్ బీజేపి బి టీమని కాంగ్రేస్ పార్టి అగ్ర నేత రాహుల్ గాంధి విమర్శించారు.  బీజేపీ బీ-టీమ్ అని మరోసారి విమర్శించారు.

మోది తనపై 24 నాలుగు కేసులు పెట్టారని, తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. కానీ ఇంత అవినీతికి పాల్పడిన కేసీఆర్ పై ఒక్క కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పై సీబీఐ, ఈడీ కేసులు లేవన్నారు. కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉన్నాడని, బీజేపీకి రాజకీయంగా మద్దతు కావాల్సి వస్తే కేసీఆర్ ను వాడుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టి బీజేపీ ఆలోచన విధానంపై కొట్లాడుతుందన్నారు. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని ఓడిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రేస్ పార్టి అగ్ర నేతలు రాహుల్ గాంధి ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బుధవారం సాయంత్రం హెలికాప్టర్ లో రామప్ప కు చేరుకుని పూజలు నిర్వహించి అనంతరం పార్టి చేపట్టినబస్సు యాత్ర ప్రారంబించారు.  


ములుగు నియోజవర్గంలోని రామానుజపురంలో లో నిర్వహించిన  కాంగ్రెస్ పార్టి  విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులకు లక్ష రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని రాహుల్ గాంధీ తెలిపారు. రాజస్థాన్ లో రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంగ్రేస్ పాలిత రాష్ర్టాలలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే హామీలు అమలు చేశామన్నారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ లో కూడ కాంగ్రేస్ పార్టి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు నెరవేరుస్తామన్నారు.

కేంద్రంలో కాంగ్రేస్ పార్టి అదికారం లోకి వచ్చిన వెంటనే సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని కుంభ మేళా రీతిలో జాతర నిర్వహిస్తామని రాహుల్ గాంధి తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా ప్రియాంక గాంధి



ప్రియాంక గాంధీ ప్రచార సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెన చూసేందుకు జనం ఆసక్తి చూపారు. సభలో ప్రసంగించిన ప్రియాంక గాంధి బిఆర్ఎస్ సర్కార్ పై ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పార్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. శ్రీకాంత చారి పేరు ప్రస్తావిస్తూ అమరుల త్యాగాలను స్మరించారు. లాభనష్టాల ఆలోచనలు చేయుకండా తమ తల్లి సోనియా గాంధి తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఏ రాజకీయ పార్టి అయినా లాభం లేకుండా నిర్ణయాలు తీసుకోదని సోనియా గాంధి తెలంగాణ ప్రజల కోసం భారి మూల్యానికి సిద్దపడి తెలంగాణ ఇచ్చిందని అన్నారు.

అంబేద్కర్, పూలే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం వస్తుందని తెలంగాణ ప్రజలు నమ్మారని కాని చంద్రశేఖర్ రావు ప్రజలను మోసం చేసారని ప్రియాంక గాంధి విమర్శించారు.

మహిళకు నెలవకు 2500 చొప్పున ఆర్థిక బృతి చెల్లిస్తామని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటి ఇస్తామని ప్రియాంక ప్రకటించారు.

ఎస్సీలకు 18 శాతం ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.

సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు అభ్యర్థి సీతక్క, భూపాల్ పల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు.

పార్టి సీనిర్ నాయకులు అనేక మంది సభకు హాజరయ్యారు. పార్టి ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, జానారెడ్డి, శ్రీదర్ బాబు, భట్టి విక్రమార్క, డాక్టర్ మల్లు రవి, జూపల్లి కృష్ణారావు, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు