రేవంత్ రెడ్డి ఓ దొంగ..కాంగ్రేస్ దోపిడీ పార్టి..కెటిఆర్

 


రాహుల్ గాంధి కెసిఆర్ పై చేసిన విమర్శలకు కెటిఆర్ తీవ్రం స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కెసిఆర్ లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసాడని ధరని పోర్టల్ తెచ్చి రైతుల భూములు కాజేసాడని రాహుల్ గాంధి చేసిన ఆరోపణలను కెటిఆర్ తప్పు పట్టారు. హైదరాబాద్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ డ్ పర్సన్స్ సమావేశంలో పాల్గొన్న కెటిఆర్ మాట్లాడుతూ నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యను గుర్తు చేస్తు కాంగ్రేస్ నిర్వాకం వల్లే ఫ్లోరోసిస్ సమస్య తలెత్తిందని అనేకమంది అంగవచెందారని అంధారని అన్నారు. రాహుల్ గాంధీకి ఏమాత్రం బుర్రలో తెలివి లేదని ఆయన లీడర్ కాదని రాసిచ్చి స్క్రిప్టు చదివే రీడరని కెటిఆర్ ఎద్దేవా చేసారు. 85 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని విమర్శ చేయడం రాహుల్ తెలివి తక్కువ తనానికి నిదర్శన మన్నారు. కెసిఆర్ కుటుంబ రాజకీయ వారసత్వం గురించి ప్రశ్నించేదుకు రాహుల్ గాంధి ఎవడని కెటిఆర్ ప్రశ్నించారు. రాహుల్ తల్లి తండ్రి నాయనమ్మ తాత ముత్తాతల పేర్లు ప్రస్తావిస్తు ముత్తాత వారసత్వ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఈ దేశంలో అతి పెద్ద అవినీతి పార్టి కాంగ్రేస్ విమర్శించారు. భూగర్భం నుండి మొదలు ఆకాశం వరకు అన్ని కుంభకోణాలకు పాల్పడి దోచుకున్న పార్టీ అని విమర్శించాడు. రాహుల్ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి ఓ పెద్ద దొంగ అని ఆన్సరు. గతంలో ఓటుకు నోటు కేసులో పట్టు పడ్డారని ఇప్పుడు నోట్లకు కాంగ్రేస్ పార్టి సీట్లు అమ్ముకుంటున్నాడని కెటిఆర్ విమర్శలు చేసాడు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు