గొడవ కూడా గోష్టే..!

 _గొడవ కూడా గోష్టే..!_



భార్యాభర్తలు ఇద్దరూ మేధావులైతే..అందునా తెలుగు పట్టభద్రులైతే..

ఆ ఇద్దరి మధ్య గొడవ..వాగ్వాదం కూడా కవితా ధోరణిలో రసవత్తరంగానే సాగుతుందిలా..


 *_ముందుగా భార్య_*

_*అందమైన హాహాకారానికి శ్రీకారం చుట్టింది..*_


_నీ పేరు నేను సముద్రతీరంలో ఇసుకలో_

_రాశాను.._

_అయితే కెరటాల తాకిడికి_

_అది చెదిరిపోయింది.._


_ఈసారి గాలిలో రాశాను.._

_అది నాకు తెలియకుండానే_ 

_ఎగిరిపోయింది.._


_అందుకే_ 

_నా గుండెలపై నీపేరు చెక్కేసాను.._

_వెంటనే గుండెపోటు_ _వచ్చేసిందోయ్!_


*_భర్త తగ్గేదేలే అంటూ.._*


_నాకు ఆకలిగా ఉందని గ్రహించిన దేవుడు.._

_సమోసా సృష్టించాడు.._

_దాహమైతే షర్బత్ పంపాడు.._

_చీకట్లో ఉంటే వెలుగు ప్రసాదించాడు..._

_నా కోసం ఇన్ని చేసిన బ్రహ్మ_ 

_సమస్యల్ని కూడా_ _ఇద్దామనుకున్నడేమో.._

*నిన్ను సృష్టించాడు!*


*_ఇప్పుడు భార్య సంధించింది మరో అస్త్రం.._*


_పురుషులందు_ _పుణ్యపురుషులు వేరయా.._

_అలాంటి వారు ఇంట్లో ఉంటారయా_

_అలా కాని వారికి పిచ్చాసుపత్రే_

_తగునయా..!_


*_ఈసారి భర్త వంతు.._*


_వాన చినుకుల్లో తడిస్తే_

_గడ్డి పూవు కూడా అందంగా_ 

_కనిపిస్తుంది.._

_అలా కురిసే చినుకు_

_ఎప్పటికీ నీపై పడదేమి..?_


*_శ్రీమతి అందుకుంది_*


_కళ్ళెదుట కొలువై ఉన్న అందాన్ని చూడలేనివి జంతువులు..అవి జూలోనే ఉండాలి.._


*_శ్రీవారి ముక్తాయింపు.._*


_సరేలే..ఈసారి జూలోనే_

_కలుద్దాం..బంధించి ఉన్న_ _నిన్ను చూస్తూ నేను.._

_ఇనుప చువ్వల మధ్య  నువ్వు..!_


*_పెళ్ళాం చివరి చురక.._*


_బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు..జూలోనూ కలలు కనడం మానవా.._ 

ఓ నిర్భాగ్య మానవా..!


   సురేష్ కుమార్

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు