బాబు కటకటాలు -అంతా జగన్నాటకం

 ఒకరు కటకటాలు..
ఇద్దరు కితకితలు..!ఇంతకీ చంద్రబాబు నాయుడు అరెస్టు సంగతి మొడీజీకి ముందుగా తెలిసినట్టే కదా..ఇదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు.తెలియకుండా ఎందుకు ఉంటుంది..!?


అసలు ఇదంతా మోడీజీ చేసిందే కదా..కథ మొత్తం కేంద్రంలోని పెద్దలే నడిపి ఉంటారు..ఎందుకంటే మోడీ లేదా అమిత్ షా అనుమతి లేకుండా జగన్ అంతటి సాహసానికి తెగబడరు.

రేపు రాబోయే ఎన్నికల్లో

బిజెపి టిడిపితో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న వేళ..

అటు మోడీకి.. 

ఇటు చంద్రబాబుకు మధ్య

పవన్ కళ్యాణ్ వారధిగా ఉన్న సమయంలో మూడు పార్టీల నడుమ సయోధ్య ఖాయం అనుకుంటున్న దశలో చంద్రబాబు అరెస్టు వంటి కీలక నిర్ణయం జగన్ తీసుకున్నారంటే ఆషామాషీ కాదు.ఈ వ్యవహారంలో వ్యూహరచన ఢిల్లీ నుంచే జరిగిందని సమాచారం.

ఇక జగన్మోహనరెడ్డికి

సంబంధించి ఈ ఉదంతం రోగి కోరుకున్నదీ అదే..

వైద్యుడు చెప్పిందీ అదే చందాన కలిసి వచ్చింది.

కేంద్రం నుంచే కథ మొదలు కావడంతో ఆయన ఒక్కసారిగా జూలు విదిలించారు.


ఇక్కడ అత్యంత కీలక అంశం జి 20 సమావేశంలో తెలుగుదేశం అధినేత మాట్లాడాల్సి ఉన్న సమయంలో అంతర్జాతీయ సంస్థ అయిన సీమెన్స్ ఉదంతంలో చంద్రబాబుని దోషిగా పేర్కొంటూ అరెస్టు చెయ్యడం పకడ్బందీ ప్రణాళికతో..పటిష్టమైన వ్యూహంతో జరిగింది.

దేశదేశాల్లో మంచి పేరున్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడంపై అంతర్జాతీయ వేదికలో కూడా గుగుసగుసలు

వినిపించాయట.. 

Oh..naidu..what happened to him..

It is known that he has been arrested..

ఆహా..ఢిల్లీ పెద్దలకు కర్ణప్రియమైన మాటలు కదా..ఇవి వినడానికే కదా జి 20 నడుస్తున్న సమయంలో బాబుని కటకటాల వెనక్కి నెట్టింది. ఓకే..స్కిల్ డెవలప్మెంట్ ఉదంతంలో చంద్రబాబు తప్పు ఉందేమో.

కానీ ఇన్నేళ్ల తర్వాత సరిగ్గా ఇప్పుడే అరెస్టు చెయ్యాలా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐటి రంగాన్ని అనూహ్య స్థాయిలో అభివృద్ధి చేసి..ఒక రకంగా

భారతదేశానికే ఐటిని తీసుకువచ్చి బిల్ క్లింటన్..బిల్ గేట్స్ వంటి ప్రపంచ దిగ్గజాల అభినందనలు పొంది విశ్వవ్యాప్తంగా

ఎందరో నాయకుల దృష్టిని 

ఆకర్షించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు..ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఇప్పటివరకు దేశంలో 

ఏ ముఖ్యమంత్రి కూడా సాధించని ఘనత..!


కీలకం ఏంటంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే నరేంద్రమోడీ కూడా సాధించని ఫీట్ ఇది.

ఒకరకంగా చెప్పాలంటే గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల నుంచే బిజెపిలో మోడీ ఎలివేషన్ మొదలైంది.

ఆయన్ని అప్పటికే ఒక హీరోగా చూపిస్తూ

బిజెపిలో పెద్ద సినిమానే నడిచింది.ఆయన సీఎంగా తన ప్రస్థానం ప్రారంభించే  నాటికే(2001)చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆరు సంవత్సరాల పాటు వెలుగుతూ దేశం మొత్తం మీద మోడీకి పోటీగా ఉండే ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా నిలబడి ఉన్నారు.అదే ఆయన చేసిన పాపమేమో..

అప్పటి నుంచే..అక్కడి నుంచే ఆయన్ని అణగదొక్కే వ్యూహాలు మొదలయ్యాయి.

మోడీ ప్రధాని అయ్యేపాటికి

కలిసి వచ్చిన వ్యవహారంగా

నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 

రెండు ముక్కలు చేసింది.దాంతో

చంద్రబాబు బలం తగ్గిపోవడమే గాక అనవసర

చర్యగా చంద్రబాబు నాయుడు బిజెపితో చెయ్యి కలిపారు.పోనీ కలిపిన వ్యక్తి అలాగే ఉండిపోయారా అంటే

2019 ఎన్నికలకి ముందు కమలానికి కటీఫ్ చెప్పి చెయ్యి కాల్చుకున్నారా.


2019 నుంచి నిన్న మొన్నటి వరకు మళ్లీ బిజెపితో చెలిమి కోసం బాబు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు.

ఇదిగో..ఇటీవల పవన్ రూపంలో ఆయనకు కాలం కలిసి వచ్చి మోడీకి చేరువయ్యే అవకాశం లభించింది.అయితే ఇంతలోనే ఇలా..!


స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో జనసేన

అధినేత తెలుగుదేశంతో తమ పార్టీ పొత్తు గురించి అప్పటికప్పుడే ప్రకటన చేశారు.అయితే బిజెపి మాత్రం నోరు మెదపడం లేదు.పైగా చంద్రబాబు అంటే పొసగని దగ్గుబాటి పురంధేశ్వరికి రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూ ఇంతకు ముందే నిర్ణయం తీసుకుని మరో నిప్పు రాజేసింది.


కథంతా ఇలా నడుస్తుండగా

చంద్రబాబు అరెస్టు వెనక బిజెపి పెద్దల హస్తం ఉందనే మాట ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.

ఈ దశలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చి జాతీయ రాజకీయాల్లో కీలకం అయ్యే అవకాశాన్ని బిజెపి ఇవ్వదలచుకోలేదని సమాచారం.అరెస్టుతో చంద్రబాబు ఖ్యాతి అంతర్జాతీయంగా కుదేలై

ఇక ఆయన జన్మలో మోడీకి ధీటుగా ఎదిగేది ఉండదు.

జగన్ సంగతి సరే..

కేసుల ఇరకాటంలో ఆయన బిజెపితో పెట్టుకునే సీన్ ఎప్పుడూ ఉండదు.ఇక దక్షిణాదిలో కేసీఆర్..స్టాలిన్..!

కవిత ఉదంతంలో టీఆరెఎస్ అధినేత ఇప్పటికే నలుగుతున్నారు.

ఉదయనిధి 

వివాదం స్టాలిన్ కుటుంబాన్ని 

కొంతలో కొంత ఇరకాటంలో పడేసినట్టే.


ఆ రకంగా ఉన్న పోటీదారులు అందరినీ ఏదో ఒక రకంగా బలహీనపరుస్తూ దక్షిణాదిలో బలం లేకపోయినా ప్రత్యర్థుల మెడలు వంచే వ్యూహాలను బిజెపి పటిష్టంగా అమలు చేస్తోంది.అందులో కీలకమైన అంకం మొన్న చంద్రబాబు అరెస్టుతో దిగ్విజయంగా పూర్తయినట్టేనని ఢిల్లీ వర్గాల కథనం.


ఇలా అరెస్టుల మీద అరెస్టులు..కేసుల మీద కేసులతో వచ్చే సానుభూతి ద్వారా వచ్చే ఎన్నికల్లో 

తెలుగుదేశం అధికారంలోకి రావచ్చునేమో గాని చంద్రబాబు ఖేల్ ఖతం చేయాలన్నది బిజెపి వ్యూహం.ఈలోగా ఏ మాత్రం అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీ దుకాణం మూయించి తమ చెప్పు చేతల్లో ఉండే పవన్ను కథానాయకున్ని చేసేందుకు

ప్రయత్నాలు జరగవచ్చు.

అది అంత ఈజీగా జరిగేది కాకపోయినా జస్ట్.. 

ఓ ప్రయత్నం..!


*_సురేష్..9948546286_*

              జర్నలిస్ట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు