మిషన్ అరెస్ట్

 

చంద్రబాబు అరెస్టు వెనక ఎంత కథ నడిచింది..

అంతకు ముందు 

ఏం జరిగింది..

ఎన్నో ప్రశ్నలు..సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది..


నంద్యాలలో అదుపులోకి తీసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కోర్టులో కాక విజయవాడ వరకు ఎందుకు తెచ్చినట్టు..?


గవర్నర్ కి తెలియకుండా అరెస్టు ఎలా..?


తెలుగుదేశం నాయకులకు గవర్నర్ అపాయింట్మెంట్ ఎందుకు రద్దయినట్టు..?

ఇచ్చినట్టే ఇచ్చి రద్దు దేనికో..?


వాదనలు ముగిసిన తర్వాత తీర్పు వెల్లడించడానికి అంత సమయం ఎందుకు..?


తీర్పు వెలువడడానికి ముందు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రాజమండ్రి జైలుకు

ఎస్పీ వెళ్లి అన్ని ఏర్పాట్లు 

పరిశీలించి తగు సూచనలు చేసారని సమాచారం..

అదెలా..

తీర్పు ఊహించా..

ముందస్తు జాగ్రత్తా..

సంగతి ముందే తెలుసా.?


ఇన్ని తెలిసిన యంత్రాంగం రెండు కాన్వాయిలను సిద్ధం చేయడం జనాల దృష్టి మళ్లించడానికా..?


రెండేళ్ల క్రితమే వాదనలు ముగిసి బెయిల్ కూడా వచ్చిన కేసులో ఇప్పుడు అరెస్టు..బెయిల్ రాకపోవడం..చంద్రబాబు న్యాయవాది వాదనలో పస లేదా..?


ముందే 144 సెక్షన్ విధింపు..

విజయవాడ నగరం మొత్తాన్ని పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకోవడం ఏమిటి..?


అసలు ఈ మొత్తం కథంతా ముఖ్యమంత్రి దేశంలో లేనప్పుడు ఎందుకు జరిగినట్టు..!?


తనను అరెస్టు చేసే అవకాశం ఉందని బాబు ముందే ఎలా చెప్పగలిగారు...

విజన్ 2023..సెప్టెంబర్..?


ఈ ప్రశ్నలకి బదులేది..!?

ఇచ్చేది ఎవరు..!?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు