కెసిఆర్ అవినీతి పాలనపై అమిత్ షా ఘాటు విమర్శలు

 చేవెళ్ల విజయ సంకల్ప సభ


తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని గంగా ప్రవాహం  వలే అవినీతి ప్రవహిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. 

కెసిఆర్ సర్కార్ ప్రజలను దోచుకుతింటోందని అన్నారు.బిఆర్ఎస్ అవినీతి సర్కారు త్వరలోనే అంతమవుతుందని తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. 

చేవెళ్ల లో జరిగిన పార్టి విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. అమిత్ షా ప్రసంగంలో కొత్తదనం ఏమి లేక పోయినా ఎప్పటి లాగే యాధాలాపంగా కెసిఆర్ పాలనీ తీరుపై  ఘాటు విమర్శలు చేసారు.  

టిఎస్ పిఎస్సీ , టెన్త్ పేపర్ లీకేజీలను అమిత్ షా ప్రస్తావించారు. తమ పార్టి ఎంపి ఏం తప్పు చేశాడని  అరెస్ట్ చేసారని ప్రశ్నించారు. టిఎస్ పిఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలపై ప్రశ్నించినందుకే  బండి సంజయ్ ను అరెస్టే చేశారని మండిపడ్డారు.  తొమ్మిదేళ్లుగా టీచర్ ఉద్యోగాలు భర్తి చేయలేదన్నారు. ఉద్యోగాల భర్తి పేరిట కెసిఆర్ నిరుద్యోగులను మోసం చేశాడని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో ఎందరో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు .పేపర్ లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ నోరు తెరవడం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే  నిజాలు అవే బయటపడతాయన్నారు.

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రధాని కావాలనే కలలు కంటున్నాడని ..ప్రస్తుతానికి ప్రధాని కుర్చి కాళీ లేదని..మళ్లీ మోదీనే ప్రధాని అవుతున్నారని అన్నారు. 

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా వద్దా.. అంటూ కార్యకర్తలను అడిగిన అమిత్ షా... సమాధానం ఢిల్లీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వినపడేలా చెప్పాలన్నారు. 

హైదరాబాద్‌ -బీజాపూర్‌ హైవే కోసం నిధులిచ్చామన్నారు.హైవేల విస్తరణ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..సరైన సమయంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అమిత్‌షా అన్నారు.

సభలో బిజెపి సీనియర్ నేతలు పలువురు ప్రసంగించారు. పార్టి అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డికె అరుణ తదితరులు ప్రసంగించారు,


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు