కుండబద్దలు వార్తల సుబ్బారావు ఇక లేరు


 ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కాటా సుబ్బారావు  కుండబద్దలు కొట్టే వార్తలు చూసే వారికి ఇదో విశాద వార్త. 

అనారోగ్యంతో భాదపడుతున్న సుబ్బారావు మృతి చెందాడని చెప్పేందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం.

సుబ్బారావు చాలా సంవత్సరాలుగా కిడ్నీలకు సంభందించిన అనారోగ్యంతో భాదపడుతున్నారు. 

కొంతకాలంగా ఆయన డయాలసిస్ కూడ చేయించుకున్నారు. 

కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీనించగా గుంటూరు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరి అక్కడే చికిత్స పొందుతూ రెండువేల ఇరవై మూడో సంవత్సరం జనవరి రెండవ తేదీన తుది శ్వాస విడిచారు

సుబ్బారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టి అధినేత నారా చంద్రబాబు నాయుడు తోపాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ సంతాపం వ్యక్తం చేసారు

కాటాసుబ్బారావు బహుముఖ ప్రజ్ఞాశాలి.

జర్నలిస్టుగానే కాక నాటక రంగం సినిమారంగంలో రచయితగా అక్టర్ గా డైరెక్టర్ గా ఎడిటర్ గా అనేక విభాగాల్లో తన ప్రజ్ఞను చాటుకున్నారు

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సుబ్బారావు అక్కడే ఐదేల్లుగా కుండబద్దలు వార్తలతో  బాగా ఫేమ్ అయ్యారు.

ఆయన యూట్యూబ్ చానెల్కు రెండు లక్షలకు పైగా  సబ్ స్క్రైబర్స్ ఉన్నారు

లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు

ఎక్కువగా రాజకీయ వార్తలను విశ్లేషిస్తు నిర్మొహమాటంగా నిఖార్సుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ఆయన స్టైల్ అందరిని ఆకర్షించింది

ఎవరెన్ని విధాలుగా బెదిరింపులకు గురి చేసినా కేసులు పెట్టి వేధించినా సుబ్బారావు నిర్భయంగా రాజకీయ నాయకుల వెధవ వేశాలపై కుండ బద్దలు కొట్టారు

కాటాసుబ్బారావు మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల యూట్యూబర్స్  ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబ సబ్యులకు ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేశారు.


Watch Video


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు