కాశీ విశ్వేరుడి సన్నిధిలో గంగా నది ఒడ్డున డేరా నగరం

 


కాశి భారత దేశంలో అత్యంత పురాతన నగరం

హిందువుల పుణ్యక్షేత్రం

ప్రతి భారతీయ హిందువు బొందిలో ప్రాణ ముండగా ఒక్కసారైనా కాశి సందర్శించాలని ఆశిస్తాడు

దేవాది దేవుడు పరమశివుడు ఇక్కడ కొలువై ఉంటాడని హిందువుల ప్రఘాడ విశ్వాసం

ద్వాదశ జ్యోతిర్ లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం కాశీలో ఉంది

కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు

మౌలిక సదుపాయాలలో కాశీని అన్ని విధాలుగా సౌకర్యంగా తీర్చిదిద్దుతున్నారు

కోట్లాది రూపాయలు వెచ్చించి  కాశి విశ్వనాధ్ ఆలయం నుండి గంగా ఘాట్స్ వరకు 

పూర్తి అయిన మొదటి దశ ఆధునీకరణ కారిడార్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోది రెండువేల ఇరవై రెండో సంవత్సరం చివరలో ప్రారంభించారు

కాశీ పుణ్యక్షేత్రం ఇప్పుడు సరికొత్త హంగులు అందాలు సంతరించుకోవడంతో గంగామాత పులకించి పోతోంది

నూతన హంగులతో సందర్శకులను అలరిస్తున్న కాశీకి ఇప్పుడు టెంటు సిటి అంటే ఢేరా నగరం  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

గంగానది ఒడ్డున అత్యంత విలాస వంతమైన సౌకర్యాలతో స్టార్ హోటెల్స్ ప్రమాణాలతో టెంటు సిటి అందుబాటులోకి వచ్చింది

ప్రధాన మంత్రి నరేంద్ర మోది ఈ టెంటు సిటీని 2023 జనవరి 13 న వీడియోకాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు

గంగానది ఒడ్డున బస చేసేందుకు నిర్మించిన టెంటు సిటీ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి

వంద హెక్టార్ల విస్తీర్ణంలో  నిర్మించిన టెంటు సిటీలో గంగా దర్శన్ విల్లాలు,  ప్రీమియం టెంట్లు ఇంకా సూపర్ డీలక్స్ టెంట్లు అందుబాటులో ఉన్నాయి

యోగా కేంద్రాలు, లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీలు, వాటర్ స్పోర్ట్స్, రిసెప్షన్ ప్రాంతంతో పాటు, గేమింగ్ జోన్‌లు, రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి

పర్యాటకులను సమీపంలోని రవిదాస్ ఘాట్, నమో ఘాట్ నుంచి బోట్ల ద్వారా టెంట్  సిటీకి తీసుకువెళ్తారు

ఈ సిటీలో మాంసం మద్యం పూర్తిగా నిషేధం

24 గంటల పాటు గట్టినిఘా ఉంటుంది

గంగా నదికి వరద పోటెత్తే వర్షాకాలంలో జూలై నుండి సెప్టెంబర్ మాసం వరకు  మూడు నెలల పాటు టెంటు సిటీలో ప్రవేశాలకు అనుమతించరు

దశల వారీగా కాశినగరం కారిడార్ అభివృద్దికి నోచుకోవడంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది

 రెండువేల ఇరవ రెండు సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం  ఏడు కోట్లకు పైగా సందర్శకులు కాశీని సందర్శించారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు