సిఎం కెసిఆర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బి.ఎల్ సంతోష్

 


తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి  ఎల్ సంతోష్ అన్నారు

తానెవరో తెలియక పోయినా తెలంగాణాలో తన పేరు మాత్రం ఇంటింటికి వెళ్లిందన్నారు సంతోష్ 

తెలంగాణ తల్లి పేరు మీద గెలిచిన వారు ఆ తల్లి రొమ్ముగుద్దారని అన్నారు

ఆవుపాలు పిండు కోవాలే తప్ప అవును చంపొద్దని బి.ఎల్ సంతోష్ సీరియస్ గా వ్యాఖ్యలు చేడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి రేపింది 

షామీర్ పేటలో కన్వీనర్లు, విస్తారక్ లు, పాలక్ లు, ప్రభారీల సమావేశంలో బిఎల్ సంతోష్ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు



ఈ సమావేశంలో పార్టి ఇన్ చార్జి బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పార్టి జాతీయ నాయకురాలు  డి.కె.అరుణ, ఈటల రాజేందర్, రఘునందనరావు, విజయశాంతి, ఎంపీ బాబూరావు, ఎమ్మెల్సి డాక్టర్ కె లక్ష్మన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 90 సీట్లు గెలుపే లక్ష్యంగా చేపట్టిన బిజెపి మిషన్  90 లో భాగంగా ఈ సమావేశం జరిగింది

మోయినా బాద్ ఫాం హవుజ్ లో ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేసింది

ఈ కేసులో బి.ఎల్ సంతోష్ పాత్ర ఉందంటూ ఆయన పేరును  కూడ చేర్చారు

అయితే సంతోష్ హై కోర్టు నుండి స్టే పొందారు

రాజకీయాలలో ప్రకంపనలు రేపిన ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది

 ఈ కేసును సిట్ నుండి సిబిఐకి బదలాయించిన తర్వాత బిఎల్  సంతోష్ రాష్ట్రానికి రావడం ఆసక్తిగా మారింది

ఈ సందర్భంగా బి.ఎల్ సంతోష్ మోయినాబాద్ ఫాం హౌవుజ్ కేసు విషయంలో  సీరియస్ గా మాట్లాడారని పార్టి వర్గాలు తెలిపాయి

తెలంగాణాలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు 

 రాష్ట్రం నుండి ఈ దుర్మార్గపు పాలనను ప్రాలదోలాలని పార్టి శ్రేణులకు పిలుపు నిచ్చారు బిఎల్ సంతోష్

బిఎల్ సంతోష్ పార్టి ముఖ్యుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు బిజెపి పార్టి నేతలు లీక్ చేశారు

ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై బి.ఎల్ సంతోష్ నోరు విప్పడం ఇదే మొదటి సారి

బిజెపి నేతలు చాలామంది ఈ విషయంలో మాట్లాడినా ఇంత వరకు మాట్లాడని బి.ఎల్ సంతోష్  మాట్లాడటం కీలక వ్యాఖ్యలుచేయడం సరైన సమయంలోసరైన సమాధానం చెబుతానని చెప్పడం సిఎం కెసిఆర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు అయిందని పార్టి ప్రముఖులు భావిస్తున్నారు

మొయినా బాద్ ఫాం హౌజ్ కేసు విషయంలో సిఎం కెసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆడియో వీడియో ఆధారాలు వెల్లడించారు

దేశ వ్యాప్తంగా న్యాయమూర్తులకు అన్ని పార్టీలు నేతలకు  కూడ వీటిని పంపించి బిజేపీని బాగా బ్లేమ్ చేశారు

దాంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది

అయితే  రోజుకో మలుపు తిరిగినట్లు ఈ కేసుచివరికి హై కోర్టు ఆదేశాలతో సిబిఐ చేతుల్లోకి వెల్లింది

 సిఎం కెసిఆర్  బీజె పీపై నెపం నెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని బి.ఎల్ సంతోష్ ను బ్లేమ్ చేయండపై ఆ పార్టి  ప్రముఖులు చాలా సిరియస్ గా ఉన్నారు.

ఈ కేసు చివరికి ఎటు తిరిగి ఎవరికి చుట్టుకోనుందో అర్దం కాని పరిస్థితి నెలకొంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు