చారిత్రక కట్టడాల హోదా - ప్రకృతి ప్రసాదించిన శోభ -ములుగు పర్యాటక సోయగాలు

ప్రసిద్ద చారిత్రక కట్టడాలు- సరస్సులు- జలపాతాలు- ఆకురాలే అడవులతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్న ములుగు జిల్లా పర్యాటక ప్రాంతాలు

 

భొగతా జలపాతం
భొగతా జలపాతం

ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు చూసేందుకు బారులు తీరుతున్నారు సందర్శకులు

సరస్సులు సెలఏర్లతో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటే మీరు ఒక సారి ములుగు జిల్లా సందర్శించాల్సిందే

పచ్చదనం ఉట్టిపడే దట్టమైన అభయారణ్యం దూకే జలపాతం కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుతమైన కళాఖండం ఇక్కడే ఉన్నాయి

హైదరాబాద్ నుండి మొదలై చత్తీస్ఘడ్ లోని భూపాలపట్నం కలిపే టూనాట్టూ జాతీయ రహదారికి ఇరువైపులా ములుగు జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు

కనువిందుచేస్తున్నాయి

పర్యాటకులతో ఈ ప్రదేశాలు నిత్యం సందడి చేస్తున్నాయి

ఇక వారాంతాలు సెలవు రోజుల్లో అయితే పర్యాటకులతో కిక్కిరిసి పోతున్నాయి

రోడ్లన్ని వాహనాలతో బారులు తీరి వేల సంఖ్యలో వచ్చే సందర్శకులతో ఈ ప్రాంతాలన్ని సందడి చేస్తున్నాయి

పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు అనేకం అందుబాటులోకి తెచ్చారు


 

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర



                                   ఆకు రాలే అడవులు ఏటూరునాగారం అభయారణ్యం



 





 






యునెస్కో గుర్తింపుపొందిన ఆలయం రామప్ప

ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది

యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య వేలల్లో ఉంటుంది

చూడచక్కని చెక్కడాలతో అలరించే శిల్పాలతో ఓ అద్భుత దృష్యకావ్యంగా కనిపించే ఈ ఆలయం వర్ణణాతీతం

నక్షత్రాకృతిలో  నిర్మాణమైన ఈ ఆలయం వందల ఏండ్ల నుండి పెద్ద పెద్దభూకంపాలను సైతం తట్టుకుని  ప్రకృతి వైపరీత్యాలకు చెక్కుచెదరకుండా నిలిచింది

సాండీ స్టోన్ తో పాటు నల్లరాయిపై చెక్కిన శిల్పాలు అద్దాల్లా మెరిచే ఆలయ స్థంభాలు మైమరిపించే అప్సరసలు

సృష్టి రహస్యాలను భోదించే సూక్ష్మచిత్రాలు

పురాణ గాధలను వివరించే లోపలి కుడ్యాలు నృత్యరత్నావళి నాట్యభంగిమలు

ఇక్కడ  ప్రతి శిలా ఓ కళాత్మక రూపమే

శిల్పకారుడి ఉలి నుండి జాలు వారిన సజీవరూపమే

అందుకే ఇక్కడి శిల్పాలను శిలలు కావవి

ఉలి తాకిడితో జల జలా పొందిన అలలని

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి వర్ణించాడు

తరాల కిందటి పురాణ కథలు

శాస్ర్తం మతమూ సమస్త కళలూ

తన యెదలోనే దాచుకున్నదీ రామప్ప 

కనులున్న వారిని చూడమన్నదీ రామప్ప అంటూ 

డాక్టర్ సి నారాయణ రెడ్డి తన రామప్ప సంగీత నృత్య రూపకంలో ఈ ఆలయం కళాఖండాలను ఎంతో గొప్పగా అద్భుతంగా అభివర్ణించాడు

రామప్ప ఆలయ కళాఖండాలలో మదనికా, నాగిని శిల్ప సౌందర్యాల చుట్టూ సాగే ఈ నృత్య రూపకాన్ని  అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి ప్రదర్శించారు

రామప్ప ఆలయం సమీపంలో కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప సరస్సు  ప్రకృతి ఒడిలో పర్యాటకులను అలరించే  ఓ అద్భుతమైన మరో దృష్యం

సరస్సు ఒడ్డున పర్యాటకులకు కాటేజీలతో పాటు సరస్సులో బోటు షికారు కూడ ఉంది

యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఈ ఆలయం పరిసరాలలో అందమైన ఉద్యానవనాలతో పాటు ఇతర మౌలిక వసతులు అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు

ఇక్కడికి కొద్ది దూరంలోనే గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కాలం నాటి కోటగుల్లు చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా అక్కడికి వెళ్తుంటారు

 వేలాడే వంతెనలతో ఆహ్లాదంలో ఓలలాడించే లక్నావరం సరస్సు 

టూనాట్ టూ నేషనల్ హైవేను ఆనుకుని ఉండే లక్నావరం సరస్సు పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తోంది

ప్రకృతిలో  మలచబడిన ఈ సరస్సు కూడ కాకతీయుల కాలంలో నిర్మించినటువంటిదే

ఈసరస్సులో అనేక ద్వీపాలు ఉన్నాయి

ఈ ద్వీపాలను కలుపుతూ వేలాడే వంతెనలు ఏర్పాటు చేసారు

తాల్లపై నడిచి వెళ్లేందుకు నిర్మించిన బర్మా బ్రిడ్జి ఓ ధ్రిల్లింగ్

బోటు షికార్లతో ఐలాండ్ లో అతిధి గృహాలతో హరిత హోటల్  పర్యాటకులను ఆకర్షిస్తోంది

జలాశయం మద్యలో గల కాకరకాయల ఐలాండ్ పై రెస్టారెంట్ కూడ ఉంది


లక్నావరం నుండి ఏటూరునాగారం వెల్లే దారిలో తాడ్వాయి అభయారణ్యం ఉంది

ఇక్కడ వనకుటీరాలు ఏర్పాటు చేశారు 

ఆకురాలే అడవులుగా ఇక్కడి అడవులను పిలుస్తుంటారు

వేల సంవత్సరాల క్రితం నాటి మహా వృక్షాలు ఇక్కడి అడవిలో ఉన్నాయి

జింకలు అడవి దున్నలు రక రకాల పక్షులు ఇక్కడ చూడవచ్చు


తాడ్వాయి మండలంలోనే అతి పెద్ద జాతర జరిగే ప్రదేశం మేడారం 

ఆదివాసి వీరవనితలు అయిన సమ్మక్క సారలమ్మల స్మృత్యర్థం ప్రతి ఏటా రెండు సంవత్సరాల కోమారు ఆదివాసీలు జరిపే ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య లక్షలు దాటి కోట్లకు చేరింది

ఈ జాతరను తెలంగాణలో గిరిజన గిరిజనేతర కుంభమేళాగా  అభివర్ణిస్తారు

సమీప రాష్ట్రాల నుండి గిరిజన గిరిజనేతరులు ఇక్కడికి వస్తుంటారు

మేడారం ప్రాంతం ప్రస్తుతం ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది

సెలవు దినాలతో పాటు నిత్యం సందర్శకులు వస్తున్నారు


ఏటూరునాగారం నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో మంగపేట మండలంలో మల్లూరు గ్రామం సమీపంలో పురాతన కాలంనాటి 

నృసింహస్వామి ఆలయం ఉంది

ఇక్కడికికూడ పర్యాటకులు నిత్యం వస్తుంటారు

ఈ ఆలయం చాళుక్యుల కాలం నాటిదిగా చెప్తుంటారు



ఇక భొగతా జలపాతం పర్యాటకులను విశేషంగా అకర్శిస్తున్న ప్రాంతం

టూనాట్ టూ జాతీయ రహదారిపై ఏటూరునాగారం నుండి గోదావరిపై నిర్మించిన బ్రిడ్జి దాటిన తర్వాత భొగథా జలపాతం వస్తుంది

భొగథా జలపాతం రాష్ర్టంలో రెండో అతి పెద్ద జలపాతంగా చెబుతుంటారు

ఇక్కడికి తెలంగాణ ఆర్టీసి వారు ఆదివారాల్లో ప్రత్యేక టూరు బస్సులు నడుపుతున్నారు

నిత్యం సందర్శకులతో పాటు సెలవు దినాల్లో అత్యధికులు ఇక్కడికి వస్తున్నారు

పర్యాటక ప్రదేశాలతో ములుగు జిల్లా తెలంగాణ లో ప్రత్యేక పర్యాటక జిల్లాగా మారింది











కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు