మోటార్లకు మీటర్లా - బిల్లులో ఉంటే రాజీనామా-బండి సంజయ్

లేదంటే సిఎం కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్

ప్రారంభమైన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర 



 విద్యుత్ బిల్లు విషయంలో సిఎం కెసిఆర్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించాడు.  నాలుగో విడత చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా సోమవారం కుత్భుల్లాపూర్  లో జరిగిన సభలోప్రసంగించారు. 

కేంద్రం చేసిన బిల్లును కేసీఆర్‌కు పంపిస్తానని, మోటార్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో ఉంటే నేను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేదంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.  ఆర్ఆర్‌ఆర్‌ను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని, మరో ఆర్‌ కలవబోతున్నారని సంజయ్‌ అన్నారు. 

హైదరాబాద్‌ను న్యూయార్క్ చేస్తానన్నాడని అట్లాగే కరీంనగర్ ను డల్లాస్ చేస్తానన్నాడని ఎక్కడ చేశారో చూపించాలని బండి సంజయ్ ప్రశ్నించారు. చిన్న పాటి వర్షం పడితే హైదరాబాద్‌ నగరం దారుణంగా మారుతుందని, నగరంలో గుంత చూపిస్తే వెయ్యి ఇస్తానన్న కేసీఆర్‌కు సీటిలోని గుంతలు చూపిస్తే రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదని అన్నారు. 



పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇస్తానని, ఇప్పటి వరకు ఇవ్వలేదని, రైతుల రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని బండి సంజయ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర  సమస్యలను గాలికి వదిలేసి దేశాన్ని పట్టుకుని తిరుగుతున్నారని, కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ కాదు  పీఆర్‌ఎస్‌ పెట్టుకుని కేఏ పాల్‌తో కలిసి తిరిగినా ఒరిగేదేమి లేదన్నారు.

బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత పాద యాత్ర  హైదరాబాద్‌ చుట్టుపక్కల  శివారు ప్రాంతాల్లో 9నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10రోజుల పాటు కొనసాగనుంది. 10రోజుల జరిగే పాదయాత్రలో బండి సంజయ్115 కిలోమీటర్లు నడవనున్నారు. మద్యలో  9రోజుల పాదయాత్రలో ఒకరోజు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈనెల 17వ తేదిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున అదే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు రానున్నారు. అమిత్ షా తో కల్సి బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన నున్నారు. 

సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌బన్సాల్తో సహా పార్టి సీనియర్ నేతలు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు