దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్

 

వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీ‌ఆర్
పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న



వనపర్తి జిల్లాలో మంగళవారం పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖకర్ రావు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  అగ్రి‌క‌ల్చర్‌ మార్కెట్‌ యార్డు కార్యాలయంతో పాటు  నూతన కలెక్టర్ భవణ సముదాయాన్ని, టిఆర్ఎస్ పార్టి కార్యాలయాన్ని ప్రారంభించారు.  ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న చేసారు.

తెలంగాణ దేశంలోనే అన్ని రంగాలలో  నెంబర్‌ వన్‌గా నిలిచిందని అన్నారు. ఒకప్పుడు కరెంట్ కూడ సరిగా లేని రాష్ర్టం  నేడు అనేక రంగాలలో అగ్రగామిగా నిలిచిందని  ఇదంతా ప్రజల సహకారంతోనే జరిగిందని అన్నారు. రాష్ర్టంలో తలసరి ఆదాయం ఇతర ఏ రాష్ర్టంలో కూడ లేని విదంగా ఉందని అన్నారు.  దేశంలో ప్రతి ఇంటికి నల్లాపెట్టి నీరిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ర్టమన్నారు. 

 'తలసరి ఆదాయం పెరగడం, విద్యుత్‌, వనరులు పెరుగడం.. గాల్లోకెల్లి  రాదు.. మాయ మశ్చింద్ర చేస్తే రాదు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా కష్టపడ్డరు. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలనే యజ్ఞంలో భాగస్వాములయ్యారు కాబట్టి ఇవాళ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు వెళ్తున్నదని'  అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు