నిల దొక్కుకుంటాడా ? పార్టీని నిలబెడతాడా ?

రేవంత్ రెడ్డి ఎదుట పెను సవాళ్లు


రేవంత్ రెడ్డి ఎట్ట కేలకు తాను అనుకున్నట్లు తెలంగాణ కాంగ్రేస్ చీఫ్ పదవిని దక్కించుకో గలిగినా ఆయన అడుగడుగునా అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డికి స్వంత పార్టీతో పాటు బయటి పార్టీల నుండి  చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రేస్ పార్టీలో అనేక మంది టిపిసిసి పదవిని ఆశించారు. వారందరిని కాదని అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇవ్వడం ఓ రకంగా చెప్పాలంటే సాహసోపేత చర్యగా  చెప్పవచ్చు. సోనియా గాంధి, రాహుల్ గాంధి ఆశీస్సులతో రేవంత్ రెడ్డికి పదవి దక్కింది.  రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి ఇవ్వడం కాంగ్రేస్ పార్టీలో చాలామంది సీనియర్లకు మింగుడు పడడం లేదు.

తెలంగాణ లో కాంగ్రేస్ పార్టి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.  తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రేస్ పార్టీకి ఏ మాత్రం క్రెడిట్ దక్కకుండా పోయింది. ఇందుకు అనేకానేక కారణాలు స్వయం కృతాపరాధాలు  కూడ ఉన్నాయి.  తెలంగాణ రాష్ట్రం సిద్దించిన  తర్వాత 2014 తొలి ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి అనుకున్న మేరకు సీట్లు సాధించ లేక పోయింది. 2014 లో 22 సీట్లతో సరిపెట్టుకోగా టిఆర్ఎస్ కు 63 సీట్లతో భారి అధిక్యత లభించి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది.. 2018 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి కేవలం 19 సీట్ల మాత్రమె గెలుచుకోగా టిఆర్ఎస్ ఆకర్ష్ పథకంలో భాగంగా  12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ లో విలీనం అయ్యారు. ఇప్పుడు రాష్ర్టంలో కాంగ్రేస్ పార్టీకి వేళ్లపై లెక్కించ దగ్గ సంఖ్యే మిగిలింది.

అసెంబ్లి ఎన్నికల అనంతరం 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఎవరూ ఊహించని రీతిలో మూడు పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించింది. మల్కాజిగిరి నుండి రేవంత్ విజయం సాధించగా భువనగిరి నుండి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ  నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. 

అయితే ఆ తర్వాత జరిగి న పలు ఉప ఎన్నిక్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రేస్ పార్టి  పుంజు కోలేక పోయింది. ఎమ్మెల్సి ఎన్నికల్లో కూడ కాంగ్రేస్ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదు. 

రాష్ర్టంలో కెసిఆర్ పై కాలు దువ్వుతూ కౌంటర్లు విసిరే రేవంత్ రెడ్డి బాగా పాపులర్ ఫిగర్ అయినా కాంగ్రేస్ పార్టీకి పూర్వ వైభనం తీసుకు రావడం అంటే మాటలు చెప్పినంత సులువు కాదు. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రేస్ పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తులతో ఆగ్రహంతో ఉన్నారు. ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇక తాను గాంధి భవన్ మెట్లు ఎక్కబోనంటూ ప్రకటన చేశాడు. అంతే కాదు రేవంత్ రెడ్డికి ఎపి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడే పదవి ఇప్పించాడంటూ ఆరోపణలు చేశాడు.  తెలంగాణలో ఉన్నది టిడిపి టిపిసిసి అని అన్నారు.  ఇవన్ని రేవంత్ రెడ్డికి ప్రతికూల అంశాలుగా మారనున్నాయి. చంద్రబాబే  రేవంత్ రెడ్డికి పదవి ఇప్పించాడనే ప్రచారం మరో వైపు భారతీయ జనతా పార్టి నేతలు కూడ ఎత్తుకున్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీకి బాగా లాభించే అంశం కానుంది.  కాంగ్రేస్  పార్టీకి మరో  సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి  రాజీనామా చేశాడు. రేవంత్ రెడ్డికి టిపిసిసి ఇస్తే పార్టీలో ఉండబోనన్న  బిసి నేత హన్మంత రావు  రేవంత్ రెడ్డికి పదవి ఖాయం అయ్యే నాటికి ఆనారోగ్యంతో  ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రేవంత్ ఆయన్ని కలిసి ప్రసన్నం చేసుకున్నాడు. అట్లాగే మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ను కలిశారు.  అసంతృప్తితో ఉన్న వారిని అగ్రహంతో ఉన్న వారిని శాంత పరిచేందుకు రేవంత్ రెడ్డికి  చాలా సమయమే పడుతుంది. 

రేవంత్ రెడ్డి గతంలో టిడిపిలో కొనసాగినపుడు ఇరుక్కపోయిన ఓటుకు నోటు కేసును అధికార టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నది. పైగా ఎప్పటి నుంచో టిఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టాలనే  పెద్ద ప్లాన్ లో నే ఉంది.  

 రేవంత్ రెడ్డి పార్టీ లోపలా బయటా  ఉన్న పరిస్థితులు ఒంటి చేతితో ఎదుర్కోవాల్సి ఉంటుంది.  తాను నిల దొక్కుకుని పార్టీని నిలబెట్టడం రేవంత్ రెడ్డి కి పెద్ద సవాల్ గా మారనుంది.

తెలంగాణ లో కాంగ్రేస్ పార్టీని లేకుండా చేయాలని కెసిఆర్ సర్వ ప్రయత్నాలు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు డజను మంది పార్టీని వీడి టిఆర్ ఎస్ లో చేరారు. తెలంగాణలో కాంగ్రేస్ పరిస్థితి ఏమిటో ఢిల్లీలో ఉన్న నేతలకు తెలియదు. పార్టీ ఇన్ ఛార్జీలకు అంతకు అవగాహన ఉండదు. కాంగ్రేస్ కు గతంలో కేవలం ఏకైక టీఆర్ఎస్ పార్టీ తో మాత్రమే పోటి కాగా ఇప్పుడు తన ప్రధాన ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీతో పోటి అనివార్య మైంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడితే తప్ప కాంగ్రేస్ కు మనుగడ సాధ్య పడదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు