తీన్మార్ మల్లన్న సభ - భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన మల్లన్న

 రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న టీములు
సాగర్ ఎన్నికల్లో పోటి చేయను -పార్టి ఇప్పట్లో లేదు
త్వరలో 6 వేల కిలోమీటర్ల పాద యాత్ర
మాజి పోలీస్ అధికారి దాసరి భూమయ్య అధ్వర్యంలో అడహక్ కమిటి ఏర్పాటు


పట్టభద్రుల ఎన్నికల్లో  మూడు జిల్లాలలో లక్షకు పైగా ఓట్లు తెచ్చుకుని పాపుల్ అయిన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న తన  రాజకీయ భవిష్యత్ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించాడు.  ప్రభుత్వ విధానాలను  విమర్శిస్తు సామాన్య జనంలో పరపతిని ఇంకా పెంచు కోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న టీములు పటిష్టం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రశ్నించే తత్వాన్ని కొనసాగిస్తు ఎప్పటి లాగే అవినీతి, అన్యాయాలపై తన పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాడు. సామాన్యుల రాజ్యాధి కారమే లక్ఖ్యంగా తీన్మార్ మల్లన్న టీములు పని చేస్తాయని స్పష్టం చేసారు.

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కాచవాని సింగారంలో ఆదివారం మల్లన్న టీము సబ్యులు, మద్దతు దారులు, ఫాలోవర్లతో జరిగిన సభలో తీన్మార్ మల్లన్న తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. సభకు మల్లన్న మద్దతు దారులు అభిమానులు భారి సంఖ్యలో హాజరయ్యారు. వివిద ప్రాంతాల నుండి వచ్చిన  వారిచేత మాట్లాడించి వారి సూచనలు సలహాలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తన కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో రాజకీయ సిద్దాంతాలు ఎట్లా ఉండాలో దిశా, నిర్దేశం చేశారు.  త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై  6 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాద యాత్ర తర్వాతే రాజకీయ పార్టి విషయంలో నిర్ణయం ఉంటుందని అన్నారు.. నాగార్డున సాగర్ ఉప ఎన్నికల్లో పోటి చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. అట్లాగే ఇప్పట్లో రాజకీయ పార్టి ఏర్పాటు చేసే ఆలోచన ఏది లేదని చెప్పారు. 

పాద యాత్ర మొదలయ్యే నాటికి రాష్ట్ర స్థాయి నుండి మొదలు జిల్లా, అసెంబ్లి నియోజక వర్గాలు, అట్లాగే మండల స్థాయి వరకు  మల్లన్న టీములను ఏర్పాటు చేసి పటిష్టం చేయాలని సంకల్పించాడు.తాను జరప బోయే యుద్దం అణు బాంబు కంటే భారి విస్ఫోటనం తో ఉంటుందని అన్నారు. తీన్మార్ మల్లన్న టీము వైపు తెలంగాణ చూస్తున్నదన్నారు. పేద ప్రజలందరు తమ టీములపై నమ్మకాలతో ఉన్నారన్నారు. సామాన్యులు చట్టసభల్లో కూర్చోవాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 

తన టీములో పనిచేసే వారు వ్యక్తి గత స్వార్దం వదులుకోవాలన్నారు. నిస్వార్దంగా పనిచేసే వారి తోనే  మల్లన్న టీములు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రజల మనిషిగా పనిచేసే వారితోనే ఉంటానని తెలిపారు. 

 తనను రాజకీయంగా  అంతం చేసేందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఏం చేయలేక పోయారన్నారు.  సోషల్ మీడియాలో 10 కోట్లతో బురద జల్లేందుకు కెటిఆర్ ఓ పెద్ద టీం ఏర్పాటు చేశాడని వారు పెట్టే పోస్టులకు ఎవరూ జవాబులు ఇవ్వవద్దని కోరారు.

సమావేశంలో  మాజి పోలీసు అధికారి దాసరి భూమయ్య అధ్వర్యంలో అడహక్ కమిటి

సమావేశంలో మాజి పోలీసు అధికారి దాసరి భూమయ్య అధ్వర్యంలో అడహక్ కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.  రాష్ట్ర కమిటి, జిల్లా కమిటీలు, అసెంబ్లి నియోజక వర్గాల కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తీన్మార్ మల్లన్న పేరుతో డబ్బులు వసూలు చేసే వారికి కాని లేదా కరపత్రాలు ఇచ్చి వసూల్లకు పాల్పడే వారికి కమిటీలలో స్థానం లేదన్నారు. తన క్యూన్యూస్ ఛానెల్ ను 24 గంటల నాన్ స్టాప్ ఛానెల్ గా తీసుకు రాబోతున్నామని తెలిపారు. ప్రతి మండలానికి ఓ రిపోర్టర్ ను అప్పాయింట్ చేస్తామన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు