హద్దు మీరితే తొక్కి పారేస్తాం - కాంగ్రేస్,బీజెపి నేతలకు సిఎం కెసిఆర్ వార్నింగ్

 

బీజెపి, కాంగ్రేస్ పార్టీలపై సిఎం కెసిఆర్ మండి పడ్డారు. హద్దు మీరితే తొక్కి పారేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వెనుకబాటు తనానికి కాంగ్రేస్ పార్టీయే కారణమని విమర్శించారు. బీజెపి నేతలకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ది చెప్పుతారని హెచ్చరించారు.

బుధవారం నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన  అనంతరం హాలియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

"కాంగ్రెస్‌ నేతలు బాగా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు మాట్లాడుతున్నారు.. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదు..మేము  తలుచుకుంటే కాంగ్రెస్ మిగులదు"  అని ఇన్నారు.  బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు.   హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.

కాంగ్రేస్ పార్టీకి తెలంగాణ పదం ఉచ్చరించే అర్హత లేదన్నారు. తెలంగాణ లోరైతుల ఆత్మహత్యలకు కాంగ్రేస్ కారణమని దుయ్యబట్టారు. 

కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకు ఒక్క రూపాయి కూడ ఇవ్వనంటే కాంగ్రేస్ పార్టి నేతలు ఆనాడు ఎందుకు మాట్లాడలేదని నిలదీసారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని కాంగ్రేస్ నేతలు విమర్శిస్తున్నారని నాగార్జున సాగర్ కాంగ్రేస్ పార్టీ కమీషన్ల కోసమే కట్టించిందా అని ప్రశ్నించారు. రైతు భీమా, రైతు భందు పథకాలు అస్తున్నందుకు కాంగ్రేస్ పార్టి పోరాటాలు చేస్తుందా అని అన్నారు. కాంగ్రేస్ హయాం లో రైతులకు కనీసం ఎరువులు విత్తనాలు కూడ ఇవ్వలేద్ననారు. విజయా డైరీని మూసి వేస్తే కాంగ్రేస్ నేతలు పట్టించు కోలేదని నల్గొండ ప్లోరైడ్ వాటర్ గురించి ప్రశ్నించలేదని విమర్శించారు.


నల్గొండ జిల్లాలో చేపట్టిన ఎత్తి పోతల పథకాలు ఏడాది కాలంలో పూర్తి చేయకుంటో ఓట్లు అడగ బోమని అన్నారు. ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తీసుకోమని త్వరలో అర్హులందరికి కొత్త రేషన్ కార్డులవు పించన్లు ఇస్తామని హామి ఇచ్చారు. కృష్ణా, గోదావరిని అనుసంధానం చేసి నల్లొండ జిల్లా కాల్లు కడుగుతా మని చెప్పారు. నల్లగొండ జిల్లా చాలా నష్టపోయిన జిల్లా అని నష్టాలకు కష్టాలకు గురైన జిల్లా అని అన్నారు.

రాష్ర్టంలో అమలు అవుతున్న పలు అభివృద్ధి సంక్షమ కార్యక్రమాలను సభలో పూసగుచ్చారు. కంటివెలుగు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నామన్నారు. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తామని, ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నామని రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు  ఏర్పాటు చేసామని 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలుగా చేశామని దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు పెడతామని న్నారు. 

 రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయితీకి 20స లక్షలు ఇస్తామని, మండల కేంద్రానికి 30 లక్షలు ఇస్తామని నల్గొండ మున్సిపాల్టీకి 10 కోట్లు ఇస్తామని చెప్పారు.  టిఆర్ఎస్ పార్టీ అంటే వీరుల పార్టీ అని వీపు చూపించే పార్టీ కాదని కెసిఆర్ అన్నారు.


హాలియా సభలో కేసీఆర్ మాట్లాడుతుండగా జనంలో ఉన్న కొందరు గట్టిగా అరుస్తూ నిరసనలు తెలిపారు. అయితే వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతూ సీరియస్ అయిన కేసీఆర్.. ‘మీ లాంటి కుక్కలను చాలామందిని చూశా’మని అరిచారు. వారందరినీ బయటకు పంపేయాల్సిందిగా పోలీసులకుహుకుం జారి చేయడంతో వారిని బలవంతంగా లాక్కెళ్లారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు