రాష్ట్రంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే ?

అదీ పరిస్థితి.. 

సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్ ఆసక్తి కర విశ్లేషణ


ఎన్నికల సమయంలో  సర్వే సంస్థల  లెక్కలు గందర గోళ పరుస్తుంటాయి. లెక్క తప్పిన సర్వేలకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయినా సర్వే సంస్థలు ఏదో క్రెడిట్ కోసం ఆరాట పడుతూనే ఉంటాయి.   తెలంగాణ లోఉన్న పొలిటికల్ సీన్ పై ‘ సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్ ' సంస్థ ఓ సర్వే నిర్వహించగా ఆసక్తి కరమైన ఫలితాలు వచ్చాయంటూ ఆన్ లైన్  మీడియాలో కొన్ని వెబ్ పోర్టల్స్ న్యూస్ షేర్ చేశాయి. 

అయితే ఈ సర్వేలో నిజమెంత అబద్ద మెంత అనే విషయాలు పక్కన పెడుతాం. ప్రస్తుతం కనిపిస్తున్న  అంచనాలకు దగ్గరగా ఉందా లేదా చదివిన వారే బేరీజు వేసుకోవాలి.

ఈ సర్వే సంస్థ ప్రకారం రాష్ట్రంలో హంగ్  పరిస్థితి ఏర్పడనుందని తేలింది. ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు తగిన మాజిక్ ఫిగర్ రాదట. అధికార టిఆర్ఎస్ పార్టీకి అయితే సర్వేలో షాక్ తినేలా 14-16 సీట్లు మాత్రమే దక్కుతాయని పేర్కొంది. బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 49 నుంచి 54 స్థానాలలో గెలుస్తుందని కాంగ్రేస్ పార్టీ బాగా పుంజుకుని 43 నుంచి 47 స్థానాలలో గెలుస్తుందని పేర్కొంది. ఏఐఎంఐఎంకు 7-10 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో డిసెంబర్ 28 నుంచి జనవరి 19 తేదీల మధ్య 1.80 లక్షల శాంపిళ్లను సేకరించి ఈ సర్వే  చేసినట్లు సంస్థ చెప్పుకుంది. 

సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని 21.4 శాతం మంది, ఫర్వాలేదని 33.3 శాతం మంది, బాగోలేదని 43.4 శాతం మంది, చెప్పలేమని 2 శాతం మంది చెప్పినట్లు ఈ సర్వే వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ పనితీరు బాగుందని 36.6 శాతం,ఫర్వాలేదని 43.2 శాతం, బాగోలేదని 17.5 శాతం, చెప్పలేమని 2.7 శాతం మంది చెప్పారట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు