గుణ పాఠాల ఆచార్య - చిరు ఎంట్రీ వైరెల్

 


కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ఈ ‘ఆచార్య’ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేసారు. మెగా అభిమానుల అంచనాకు తగిన రీతిలోనే టీజర్ అదిరి పోయింది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో  టీజర్ మొదలవగా ఆచార్య వైలెంట్ గా ఎంట్రీ  ఇస్తాడు. 

‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ చిరంజీవి డైలాగు సినిమా ఏ ఏరేంజిలో ఉండబోతోందో తలియ జేస్తుంది. ఫైట్స్ ప్రత్యేకంగా చిత్రీకరించారు. సోషల్ మెసేజ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా చిత్రాలు నిర్మించడంలో  దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకత చూపే వ్యక్తి.గతంలో ఆయన సినిమాలు ఇట్లాగే  హిట్ అయ్యాయి.  ఈ సినిమాలో సిద్ధ అనే ప్రధాన పాత్రలో తండ్రితో పాటు చరణ్ వెండితెరపై కనిపించ బోతున్నాడు.  శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి లో ఆచార్య విడుదలకు సిద్దం అవనుంది.



భూతల స్వర్గం..... గో.... గో....గోవా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు