ప్రధాన పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు

 

ప్రధాన పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు
ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తాడిశెట్టి క్రాంతికుమార్


   తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని, సామాజికన్యాయం కోసం పోరాటం చేస్తూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను తాడిశెట్టి క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం హన్మకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్యావంతులైన పట్టభద్రుల ఓట్లతో ఎన్నుకోబడే ఎమ్మెల్సీనీ నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన వారిని ఎన్నుకోవాలని, ప్రజల మౌలిక రంగాలైన విద్య, వైద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక విజన్ కలిగిన నాకు ఓట్లు వేసి శాసనమండలికి పంపిస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణలో ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విముక్త చిరుతల కక్షి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో చైతన్యంతో ఎన్నుకోవాల్సి పట్టభద్రుల ఎన్నికల్లో చొరబడి ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రధాన పార్టీలో పోటీలో పెట్టిన అభ్యర్థులను ఓడించి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పెద్దల సభలో సామాజిక దృక్పధం కలిగిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి మాట్లాడుతూ నైతిక విలువలు, ప్రజల మేలు కోసం నిరంతరం పోరాటం చేసే క్రాంతికుమార్ కు పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, ప్రలోభాలమయమైన రాజకీయాలను మార్చాలంటే క్రాంతికుమార్ లాంటి విద్యావంతులను, సామాజిక బాధ్యత గలవారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ గడిచిన పదేండ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి పార్టీ ఫిరాయింపులకు ప్రధాన కేంద్రంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని, దేశంలో మతాల మారణహోమం సృష్టిస్తూ మావోయిస్టుల పేరుతో ఆదివాసులను చంపుతూ, ప్రశ్నించే గొంతుకలను అర్బన్ నక్సల్ పేరుతో అక్రమంగా జైళ్ళలో పెడుతున్న బిజెపి పార్టీని చిత్తుగా ఓడించాలని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బి.సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ ఊసే తీయడం లేదని, బి.సి లకు మోసం చేయచూస్తున్న కాంగ్రెస్ ను కూడా పట్టభద్రులు ఓడించాలని, సామాజికన్యాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే విజన్ కలిగిన విద్యావంతుడు తారిశెట్టి క్రాంతికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. 

    ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, విముక్త చిరుతల కక్షి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ కొంగ వీరాస్వామి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, వివిధ సంఘాల నాయకులు చింతకింది కుమారస్వామి, చాపర్తి కుమార్ గాడ్గే, ఏదునూరి రాజమౌళి, సాగంటి మంజుల, దేవిక, సింగారరపు అరుణ,  ధారబోయిన సతీష్, తాడిశెట్టి కార్తీక్, రాజేశ్వర్ రావు, జన్ను సాంబయ్య, గురిమిళ్ళ రాజు, తాడూరి మోహన్, జూకంటి రవీందర్, శోభ, నలబోల అమర్, సంజయ్, ఎతిపతి నితిన్,  న్యాయవాదులు రాచకొండ ప్రవీణ్ కుమార్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు