శ్రీకాంతచారి స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తాం

 


శ్రీకాంతచారి స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తాం


చట్టసభల్లో బి.సి వాటా పోరాటానికి శ్రీకాంతచారి తల్లితండ్రుల మద్దతు


    తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరడు శ్రీకాంతచారి స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాధిద్దామని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు అన్నారు. చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం ఈ నెల ఒకటిన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన బి.సి మహా పాదయాత్ర 11వ రోజు 220 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అమరుడు శ్రీకాంతాచారి  స్వగ్రామం పొడిచేడు చేరుకొని ఆయన తల్లితండ్రులు వెంకటాచారి, శంకరమ్మ ల దీవెనలు తీసుకొని శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. 



     శ్రీకాంతచారి తల్లిదండ్రులు వెంకటాచారి, శంకరమ్మలు మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేసిన మా కుమారుడితో పాటు 1200 మంది బలిదానాలు చేసుకున్నారని, వారు కలలు కన్న తెలంగాణ చూడలేకపోయామని అన్నారు. ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఏ ప్రభుత్వాలు మారినా అందులో త్యాగాలు బి.సి లవి అవుతున్న అధికారం, అభివృద్ధి మాత్రం ఆధిపత్య కులాలది అవుతుందని అన్నారు. మనది కాని పోరాటానికి మన బి.సి లు త్యాగాలు చేసారని అన్నారు. నేడు బి.సి ల అభివృద్ధి కోసం జరిగే ఈ పాదయాత్ర ఉద్యమానికి మేము ముందుంటామని, చట్టసభలలో వాటా సాధించిన నాడే సామాన్య బి.సి లు చట్టసభల్లోకి వెళ్లగలుగుతారని, అలాంటి ఉద్యమానికి అన్ని విధాలుగా సహకారంగా ఉంటూ కలిసి నడుస్తామని వారన్నారు. పాదయాత్ర బృందాన్ని వారి ఇంటికి ఆహ్వానించి శంకరమ్మ దంపతులు అందరినీ శాలువాలతో సత్కరించారు. 

   ఈ కార్యక్రమంలో పాదయాత్ర నాయకులు సింగారపు అరుణ, బుచ్చిబాబు, గడిపిపె విమల, బాలస్వామి, ఎర్రమల్ల శ్రీను, బుచ్చిబాబు, ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, విశ్వపతి, కుంట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు