మొదటి రోజే హడల్ ఎత్తించిన షర్మిల

 మొదటి రోజే హడల్ ఎత్తించిన షర్మిల
కాన్వాయ్ ఆపిన పోలీసులపై ఫైర్
రాజన్న బిడ్డనంటూ హెచ్చరిక



ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ పార్టి అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల భాద్యలు చేపట్టిన మొదటి రోజే హడలెత్తించారు.  భాద్యతలు స్వీకరించేందుకు వెళుతున్న షర్మిల కాన్వాయ్ ను పోలీసులు ఎనికేపాడు వద్ద నిలిపారు. కాన్వాయ్ ను అక్కడి నుండి దారి మళ్లించారు. వాహనాల మళ్లింపుపై కాంగ్రేస్ పార్టి శ్రేణులు అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. 

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే పద్దతంటూ షర్మిల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులు షర్మిలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఇది పద్దతి కాదంటూ తాము ముందే అనుమతి తీసుకున్నా ఇలా కాన్వాయ్ అడ్డు కోవడం సరికాదని అన్నారు. దాంతో చివరికి పోలీసులు చేసేది లేక కాన్వాయ్ కు అనుమతి ఇచ్చారు. రాజన్న బిడ్డ ఎవరికి భయపడదని రాష్ర్టంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు.


పార్ట చీఫ్ గా భాద్యతలు చేపట్టిన షర్మిల తన సోదరుడు వై.ఎస్ జగన్ రెడ్డి పాలనపై ధ్వజ మెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ర్టం అప్పులపాలైందని విమర్శించారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని విమర్శించారు. రాజధాని కట్టడానికి కూడ డబ్బులులేవనన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేతకాలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌... ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని.. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు.


రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయేందుకు జగన్ రెడ్డే కారణమని షర్మిల మండిపడ్డారు. జగన్ 3 రాజధానులు అని ఒక్కటీ కూడా కట్టలేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చేశారని దుయ్యబట్టారు. 


బీజేపీ ఏపీపై కపట ప్రేమ చూపించడమే తప్ప రాష్ర్టం అభివృద్దికి  చేసిందేమీ లేదని షర్మిల మండిపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు అన్న బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. నేడు అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా చూపించాలని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలపై ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనం మొత్తం తీసుకువస్తామని మోదీ చెప్పలేదా.. ఎంత తెచ్చారు.. పేదల చేతుల్లో ఎంత పెట్టారని ప్రశ్నించారు. ఇంత మోసం చేసిన బీజేపీనీ ఎలా నమ్మాలని నిలదీశారు. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే వీరు చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయతీలు, ఇతర సౌకర్యాలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలు వస్తే బిడ్డలకు ఉద్యోగాలు కూడా వచ్చేవని తెలిపారు. పదేళ్లల్లో ప్రత్యేక హోదా రాకపోవడం కాదు.. పాలకులు తేలేకపోయారని షర్మిల ధ్వజమెత్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు