నువ్వులు మనం అరుదుగా వాడుతుంటాం. ఇక నుండి విరివిగా వాడండి. ముఖ్యంగా నువ్వుల్లో తెల్ల నువ్వులకన్నా నల్ల నువ్వులు చాలా శ్రేష్టం. వీటిని ఎక్కువ గా దాణ ధర్నాల కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. నల్ల నువ్వులు మనిషికి ఎంతగా మేలు చేస్తాయంటే ఈ రోజుల్లో అనేక మంది కీళ్ల నొప్పులతో సత మత మయ్యే వారు నల్లనువ్వులు తింటే చాలు నొప్పుల నుండి ఉపమనం కలుగుతుంది. ఈ చిన్న గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చలికాలంలో వీటిని ఎక్కువగా తింటుంటారు. ఆయుర్వేదంలో ఈ విత్తనాలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ విత్తనాలు మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
నువ్వుల నూనెను వంటకాల్లో, దీపారాధనకు ఉపయోగిస్తాం. వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయని పరిశోధనల్లో తేలింది.
వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చాలా మందిలో విటమిన్ బి, ఐరన్ లోపం వల్ల జ్ఞాపకశక్తి మందగించడం, జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుంటుంది. నల్ల నువ్వుల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. వీటిలోని విటమిన్ ఇ చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. నల్ల నువ్వులు తింటే కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. పేగు కేన్సర్ రాకుండా ఉంటుంది.
నువ్వుల్లోని సిసేమిన్ లివర్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. దీనిలోని పీచు, అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇందులోని నూనె పేగులు పొడిబారకుండా చూస్తాయి. వీటిని మెత్తగా రుబ్బి తీసుకున్నట్లయితే కడుపులోని నులిపురుగులు బయటకు వెళ్లిపోతాయి. నువ్వులలోని మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది.
సాధారణంగా ఆడవారిలో 35 యేళ్లు దాటితే ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్లనువ్వులను ఆహారంలో భాగంచేసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులు తింటే చాలా మంచిది.
నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
నల్ల నువ్వుల్లో పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నల్ల నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రేగు కదలిక ప్రక్రియ సులభం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
నల్ల నువ్వులు పోషకాల నిధి. వీటిలో విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే గుణాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
నల్ల నువ్వులను మన ఆహారంలో ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే మీ రోజువారీ ఆహారంలో నల్ల నువ్వులను పరిమిత పరిమాణంలో ఉపయోగించండి.
పోషకాలు పుష్కలంగా ఉండే నల్ల నువ్వులు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే క్యాల్షియం, కాపర్, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మీకు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరంగా ఉంటాయి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box