రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ అని మోగనున్న భరోసా

 

కొత్తగా విధివిధానాలు రూపొందించాలని నిర్ణయం

లెక్కలు తీయాలని సిఎం రేవంత్ రెడ్డి  ఆదేశం


రైతుల ఖాతాల్లో ఇక  టింగ్ టింగ్ అని మోగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాలతో  రైతు భరోసా నిధులు విడుల చేశారు. సోమవారం రాత్రి నుండే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. 

కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రేస్ ప్రభుత్వం  ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు ప్రయాణం తో పాటు ఆరోగ్య శ్రీ పరిధిని పది లక్షలకు పెంచుతూ రెండు హామీలు నెర వేర్చింది. రైతు భరోసా ఎప్పుడంటూ  అప్పుడే బిఆర్ఎస్ పార్టీ నేత మాజి మంత్రి హరీశ రావు ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రి వర్గ సహచరులు సచివాలయంలో వివిద శాఖలపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు.  రైతు భరోసా విషయంలో ఇంకా కొత్తగా మార్పులు చేర్పులు లేకుండానే పాత రైతు భందు నిభందనల మేరకు నిధులు  విడుదల చేయాని నిర్ణయించారు.

రైతు భరోసా విషయంలో పూర్తి లెక్కలు తీసి కొత్తగా విధి విధానాలు నిర్ణయించాలని కాంగ్రేస్ ప్రభుత్వం భావిస్తోంది. చిన్న కారు రైతులకు ఈ భరోసా పరిమితం చేయాలని ప్రజల నుండి విజ్ఞాపనలు ఉన్నాయి. సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని సాగుకు యెగ్యం కాని భూములకు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని గతంలో వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఇలా దుర్వినియోగం జరిగిందని సామాన్యుల్లో ఆందోళన ఉంది. రియల్ ఎస్టేట్ కోసం ఖరీదు చేసి పెట్టుకున్న బూములకు పంటలు సాగు కాని భూములకు రైతు భరోసా వద్దే వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.


అయితే ఈ భరోసా పథకం పై కాంగ్రేస్ పార్టి లోతుగా అధ్యయనం చేసి కొత్తగా విధిదానాలు రూపొందించే ప్రక్రియ చేపట్టనుంది. రైతు భందు అందరికి అన్ని ఎకరాలకు కాకుండా పరిమితులు విధించే అవకాశాలు ఉన్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు